Chiranjeevi : చిరంజీవి నీడలో పెరిగిన పవన్ కళ్యాణ్, నాగబాబు.. ఆయనను ఇప్పుడు దూరం పెట్టేశారా ?

Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి అండదండలతో ఆయన పేరు, పలుకుబడితో ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నాగబాబు, పవన్ కళ్యాణ్. చిరంజీవి అనే మహావృక్షం నీడలోనే పెరిగి పెద్దయిన వీరికి నేడు చిరంజీవి పరాయి వాడిగా మారిపోయారా..? అనే సందేహం ప్రస్తుతం అందరిలోనూ కలుగుతోంది.

Chiranjeevi

తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్, నాగబాబు పార్టీ కార్యక్రమాలలో పాల్గొని ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం నాగబాబు ఇచ్చిన ఓ పుస్తకమే అని చెప్పడం అందరినీ కాస్త అసహనానికి గురిచేస్తోంది. తమ విజయానికి ఎంతో కారణమైన చిరంజీవిని పేరుకైనా చెప్పకపోవడంతో ఎంతోమంది మెగా బ్రదర్స్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్, నాగబాబులు చిరంజీవిని పక్కన పెట్టడానికి కారణం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి సన్నిహితంగా మెలగడమే.. అనే సందేహాలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి పార్టీలకు అతీతంగా సతీ సమేతంగా వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆ తరువాత సినీ పరిశ్రమ సమస్యల గురించి పలు సార్లు ముఖ్యమంత్రిని కలవడం, ఆయనతో సన్నిహితంగా ఉండటం పవన్ కళ్యాణ్ కు నచ్చలేదు. సినీ పరిశ్రమలో ఏర్పడిన సమస్యలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని భావించిన జనసేన పార్టీకి మెగాస్టార్ ఆ అవకాశం ఇవ్వలేదు.

పలుసార్లు ముఖ్యమంత్రి జగన్‌ ని కలిసి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపించారు. ఇలా సినీ పరిశ్రమకు జగన్ అండదండలు ఉండటంతో చిరంజీవి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పలుసార్లు ట్వీట్స్ చేశారు. అయితే చిరంజీవి జగన్ తో సన్నిహితంగా ఉండడం మెగా బ్రదర్స్ కి నచ్చలేదు. అందుకే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చిరంజీవి హాజరు కాకపోవడం, చిరంజీవి గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం.. జనసేన అభిమానులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తమ రాజకీయాల కోసం తమకు నీడను ఇచ్చి ప్రయోజకులను చేసిన సొంత అన్ననే మెగా బ్రదర్స్‌ దూరం పెట్టేశారా ? అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇక దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి పోరులో ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…

Wednesday, 11 March 2026, 10:24 PM

విడాకులు తీసుకున్న హన్సిక.. పెళ్లయిన రెండేళ్లకే భర్తతో బంధం కట్! భరణం కూడా వద్దంటూ..

నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…

Wednesday, 11 March 2026, 9:27 PM

ఉద్రిక్తతల మధ్య క్షేమంగా చెన్నైకి అజిత్.. దుబాయ్ నుండి రాక.. వీడియో వైరల్!

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెల‌కొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య త‌మిళ నటుడు…

Wednesday, 11 March 2026, 6:19 PM

వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో అర్ష్‌దీప్‌కు ఐసీసీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…

Wednesday, 11 March 2026, 2:59 PM

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM