Parvati Melton : దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన వెన్నెల చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పార్వతి మెల్టన్. ఆ చిత్రంలో ఈమె గ్లామర్ కు, క్యూట్ ఎక్స్ప్రెషన్లకు కుర్ర కారు ఫిదా అయిపోయారు. ఆ తరువాత పార్వతి మెల్టన్ గేమ్, అల్లరే అల్లరి, మధుమాసం వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఈమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా చిత్రమే అని చెప్పాలి. ఆ తరువాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన దూకుడు చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను తన గ్రామర్ తో ఆకట్టుకుంది.
అందం, అభినయం ఉన్న పార్వతి మెల్టన్ ను గ్లామర్ లుక్ లోనే ప్రేక్షుకులు ఇష్టపడేవారు. ఎంత క్రేజ్ వున్నా తెలుగు సినిమాల్లో హీరోయిన్ స్థాయిలో అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన హల్లో చిత్రంలో నటించి అలరించింది. ఈ సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చివరగా 2012లో ఈ బ్యూటీ యమహో యమ అనే సినిమాలో కనిపించి ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యింది.
ఇక పార్వతి మెల్టన్ ఎవరనే విషయంలోకి వెళ్తే,ఈమె పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. న్యూజెర్సీలో జర్మనీ దేశానికి చెందిన శ్యాం మెల్టన్, ఇండియన్ పంజాబీ దార్ ప్రీత్ కి పుట్టింది పార్వతి మెల్టన్. ఈమెకి ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు హరియాణా సితారా మెల్టన్. ఇక పార్వతి మెల్టన్ కి చిన్ననాటినుంచి డాన్స్ అంటే ఎంతో మక్కువ. కాలిఫోర్నియాలో డిగ్రీ చదివే సమయంలో భరతనాట్యం నేర్చుకున్న పార్వతి మెల్టన్, వివిధ స్టేజ్లపై ప్రదర్శనలు కూడా ఇచ్చింది. వెన్నెల చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది పార్వతి. ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో 2013లో అమెరికాలో యువ పారిశ్రామికవేత్త శ్యాం సులాల్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం పార్వతి న్యూజెర్సీలో సెటిల్ అయింది. ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం భర్తతో కలిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…