Parvati Melton : పార్వ‌తి మెల్ట‌న్ కెరీర్ నాశ‌నం అవ‌డానికి ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులే కార‌ణ‌మా..?

Parvati Melton : 2005వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో హీరో రాజాతో కలిసి జంటగా నటించిన పార్వతీమెల్టన్ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో పార్వతీమెల్టన్ కి అంత గుర్తింపు రాకపోయినా పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ ఆడి పాడి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.  దూకుడు లో మహేష్ తోపాటు పూవాయ్ పూవాయ్‌ అంటాడు ఆటో అప్పారావు అంటూ మహేష్ తో జతకట్టి అందరినీ ఆకట్టుకుంది. అప్ప‌ట్లో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ ఇంట్రడక్షన్ తో పార్వతి అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ.

అందం, అభినయం ఉన్న‌ పార్వ‌తి మెల్ట‌న్ ను గ్లామ‌ర్ లుక్ లోనే ప్రేక్షుకులు ఇష్ట‌ప‌డేవారు. కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వెన్నెల చిత్రం తర్వాత నటించిన గేమ్, అల్లరే అల్లరి తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎంత క్రేజ్ వున్నా తెలుగు సినిమాల్లో  హీరోయిన్ స్థాయిలో అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. మ‌ళ‌యాళంలో మోహ‌న్ లాల్ హీరోగా నటించిన హ‌ల్లో చిత్రంలో న‌టించి అల‌రించింది. ఈ సినిమా మళ‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. చివ‌ర‌గా 2012లో ఈ బ్యూటీ య‌మ‌హో య‌మ అనే సినిమాలో క‌నిపించి ఆ త‌రువాత సినిమాల‌కు దూరం అయ్యింది. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో పార్వ‌తి మెల్ట‌న్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Parvati Melton

త‌న సినిమా కెరీర్ నాశనం కావడానికి  ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కార‌ణమ‌ని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. అయితే ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల పేర్లు మాత్రం ఆమె బయటకు వ్యక్తం చేయలేదు. అంతే కాకుండా 2013లో తాను శంసులాలానిని వివాహం చేసుకున్న‌ట్టు తెలియజేసింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవ‌నం సాగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM