Pakka Commercial : ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

June 25, 2022 2:15 PM

Pakka Commercial : మారుతి ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా వ‌స్తున్న మూవీ.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. ఈ సినిమా జూలై 1వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌ను లాంచ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గోపీచంద్ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భిన్న‌మైన పాత్ర‌లో ఈ మూవీలో క‌నిపించ‌నున్నాడ‌ని సినిమాను చూస్తే అర్థ‌మ‌వుతుంది. మారుతి సినిమా క‌నుక ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా ఉంటుంది. దీంతో ఈ మూవీపై గోపీచంద్ ఆశ‌లు పెట్టుకున్నాడు.

ఇక ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు చెందిన డిజిట‌ల్ హ‌క్కుల‌ను రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సొంతం చేసుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, ఆహా సంస్థ‌లు ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాయి. దీంతో ఈ రెండు యాప్‌ల‌లోనూ మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక సినిమా విడుద‌ల‌య్యాక 5 వారాల‌కు స్ట్రీమ్ చేసుకునేట్లుగా ఒప్పందం జ‌రిగింది. క‌నుక ఆగ‌స్టు మొద‌టి వారం త‌రువాత ఈ మూవీ ఓటీటీల్లోకి వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Pakka Commercial will be released on Netflix and Aha platforms
Pakka Commercial

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తుండ‌గా.. క‌ర్మ్ చావ్లా సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే గోపీచంద్‌కు వ‌రుస‌గా అనేక ఫ్లాప్స్ వ‌చ్చాయి. దీంతో ఈ మూవీపైనే ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment