OTT : ఈ వారం ఓటీటీల్లో అల‌రించ‌నున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాలు..!

OTT : ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల క‌న్నా ఓటీటీల్లోనే మూవీల‌ను చూసేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. అందుక‌నే ఓటీటీ యాప్‌లు సైతం వీలైనంత త్వ‌ర‌గా కొత్త మూవీల‌ను త‌మ త‌మ ప్లాట్‌ఫామ్‌ల‌పై ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అందుక‌నే వారం మారే కొద్దీ కొత్త కొత్త మూవీలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న మూవీలు, సిరీస్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ గ‌న్ మావెరిక్ అనే హాలీవుడ్ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా 1 బిలియ‌న్ డాల‌ర్ల గ్రాస్‌ను వ‌సూలు చేసింది. అయితే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 24వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ సిరీస్ అయిన ఢిల్లీ క్రైమ్ రెండో సీజ‌న్ ఈ నెల 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ తొలి సీజ‌న్ హిట్ అయింది. అందుక‌నే రెండో సీజ‌న్‌ను రిలీజ్ చేస్తున్నారు.

OTT

ఇక హాలీవుడ్ సూప‌ర్ స్టార్ సిల్వెస్ట‌ర్ స్ట‌లోన్ న‌టించిన స‌మారిట‌న్ అనే ఇంగ్లిష్ మూవీ కూడా ఓటీటీలోకి వ‌స్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ నెల 25వ తేదీన రిపీట్ అనే సిరీస్‌ను స్ట్రీమ్ చేయ‌నున్నారు. డ్రామా జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో న‌వీన్ చంద్ర న‌టించాడు.

రాచ‌స‌న్ అనే త‌మిళ మూవీకి రీమేక్‌గా రూపొందిన క‌ట్ పుట్లి అనే హిందీ మూవీని సెప్టెంబ‌ర్ 2వ తేదీన నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం లేదు. ఇందులో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM