Oppo : మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత్ లో విడుదల చేసింది. ఒప్పో రెనో 7 5జి, రెనో 7 ప్రొ 5జి పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ధరలు కూడా అందుబాటులోనే ఉండడం విశేషం.
ఒప్పో రెనో 7 5జి ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల 5జికి సపోర్ట్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో లభిస్తుంది.
రెనో 7 5జి ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లతోపాటు ఒక మెమొరీ కార్డును కూడా వేసుకోవచ్చు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అదనంగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి.
రెనో 7 ప్రొ 5జి ఫోన్‌లో.. 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి కూడా 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల ఇందులోనూ డిస్‌ప్లే అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. కనుక 5జి కి సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌వేరియెంట్‌లో విడుదలైంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు.
రెనో 7 ప్రొ 5జి ఫోన్‌లో.. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ టైప్‌లో దీన్ని అందిస్తున్నారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. దీనికి తోడు అదనంగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.
ఒప్పో రెనో 7 5జి ఫోన్ ధర రూ.28,999 ఉండగా.. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ నెల 17వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అలాగే ఒప్పో రెనో 7 ప్రొ 5జి ఫోన్ ధర రూ.39,999 ఉండగా.. దీన్ని ఫిబ్రవరి 8వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…