OnePlus 10 Pro : మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్.. తాజాగా మరో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ 10 ప్రొ పేరిట ఆ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేశారు. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలైంది.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. మెమొరీ కార్డు స్లాట్ లేదు. వెనుకవైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ మైక్రోఫోన్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. కేవలం 32 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది. అదే వైర్‌లెస్ చార్జింగ్ అయితే 47 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
ఇక వన్ ప్లస్ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ వొల్కనిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.66,999 ఉండగా.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.71,999గా ఉంది. అమెజాన్‌తోపాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి లభ్యం కానుంది.
ఇక లాంచింగ్ కింద వన్‌ప్లస్ 10 ప్రొ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఎస్‌బీఐ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌పై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందివ్వనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…