NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఏదైనా బిగ్గెస్ట్ ప్లాన్ చేస్తున్నారా అంటే.. అవుననే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే కాలంలో పాలిటిక్స్ కోసం రెడీ అవుతున్నారట. 2024 ఎలక్షన్స్ కోసం తన ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడానికే ప్రముఖ టీవీ షోలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ని చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ పేరులో నుండి జూనియర్ అనే పేరుని తీసేశారు.
ఎన్టీఆర్ అనే సంబోధించడంతో ఈ వార్తలకు మరింత ప్రాణం పోసినట్లయింది. ఎన్టీఆర్ ను తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్, తారక్ అనే పేర్లతో పిలుస్తారు. కానీ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రామ్ లో మీ రామారావు అంటూ సైన్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు బుల్లితెర టీవీ ప్రోగ్రామ్ లోనూ ఎన్టీఆర్ అనే పిలుస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మనవడిగా ఆయన పోలికలతో పాటు నటనను కూడా సొంతం చేసుకున్నారు ఈ హీరో.
ఈ ప్రోగ్రామ్ లో మరో హైలెట్ అయ్యే మాట ఏంటంటే.. ఎన్టీఆర్ ను మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రామ్ కు వచ్చే మహిళలు అన్నయ్య అంటూ పిలుస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సరిపోయే అన్ని రకాల అంశాలు కనిపించేసరికి సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ అవుతున్నాయి. దీంతో ఈ షో ద్వారానే ఎన్టీఆర్ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. రాబోయే కాలంలో టీడీపీకి తనే ముందుండి నడిపించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారా.. అని అనుకుంటున్నారు. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…