Nithya Menon : ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల ముద్దుగుమ్మ నిత్యా మీనన్. ‘ఇష్క్’ సినిమాతో యూత్‌కు ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘జబర్దస్త్’ చిత్రంతో కాస్త తడబడ్డా నిత్య ‘గుండె జారి గల్లంతయ్యిందే’తో మరోసారి కుర్రకారుల గుండెల్ని కొల్లగొట్టింది. ఈ అమ్మడు ఒక్క తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తన నటనతో, మధుర గాత్రంతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
కెరీర్ ఫాంలో ఉన్న సమయంలోనే గ్యాప్ తీసుకున్న నిత్యామీనన్‌కి.. పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కింది. ఇటీవల నిత్యాకి సంబంధించి కొన్ని లుక్స్ విడుదల కాగా, ఇందులో అమ్మడి లుక్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. వకీల్ సాబ్ తర్వాత నిత్యాకి వరుస ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. నాని నటిస్తోన్న దసరా మూవీలో నిత్యను అతిథి పాత్ర కోసం ఎంపిక చేశారట మేకర్స్.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నిత్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేయగా, ముఖ్య పాత్ర కోసం నిత్యాని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ పాత్ర ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. గతంలో నాని.. నిత్య మీనన్ కాంబోలో వచ్చిన అలా మొదలైంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు నానికి నిత్యా సెంటిమెంట్ కలసి వస్తుందని అంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…