Bigg Boss 5 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లోకి అనూహ్యంగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన కంటెస్టెంట్ లోబో. వాస్తవానికి అయితే గత సీజన్ లోనే లోబో బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టాల్సింది. కానీ అప్పుడు ఆ అవకాశం మిస్ అవ్వగా ఈ సారి దక్కింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో భిన్నంగా కనిపించే లోబో మాట్లాడడం కూడా కాస్త డిఫరెంట్‌గా మాట్లాడతాడు. లోబో పక్కా హైదరాబాదీ కావడం అందరినీ ఇంకాస్త దగ్గరికి చేసింది.
స్కూల్ టైంలో దొంగతనం చేసి దొరికిపోవడంతో తొమ్మిదే తరగతికే టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీంతో మధ్యలోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత ఓ టాటూ షాపులో పనిచేశాడు. అక్కడ ఓ రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు. లోబో కట్టుబొట్టు అంతా విచిత్రంగా ఉండడంతో ఆ యువతి అతనికి లోబో అనే పేరు పెట్టేసింది. దీంతో అప్పటినుంచి మహమ్మద్ ఖయ్యూం కాస్తా లోబోగా మారిపోయాడు.
బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన లోబో అరియానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్ బజ్’లో పాల్గొన్నారు. ఇందులో ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలు చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఉన్న సభ్యులందరిలో కాజల్ ఎంతో మంచి వ్యక్తి. ఆమె గేమ్ బాగా ఆడుతుంది’’ అని లోబో సమాధానమిచ్చాడు.
సిరి అన్ని చేసేసి ఏదైనా తప్పు జరిగితే హౌస్‌మేట్స్ అందరిపై కేకలు వేస్తుందని లోబో అన్నాడు. ఇక, షణ్ముఖ్ గురించి చెబుతూ.. ‘‘షణ్ముఖ్‌కి ఓ విభిన్నమైన వ్యవహార శైలి ఉంది. ఆయనకు గేమ్ మొత్తం ముందే తెలుసు’ అన్నాడు. మరి పూర్తి ఎపిసోడ్‌లో ఏం చెబుతాడా.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…