Nellore Chepala Pulusu : మన తెలుగువారంటేనే భోజనప్రియులు అని వేరే చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు అంటే తెగ పడి చచ్చిపోతారు. ఆంధ్ర వంటకాలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మన వంటకాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా చేపల పులుసు పెట్టడంలో మన వాళ్లకు సాటి మరెవరూ ఉండరు. చేపల పులుసు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మన నెల్లూరోళ్ల చేపల పులుసు. చేపల పులుసు పెట్టాలి అంటే మన నెల్లూరోళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. వాళ్ళు వండే చేపల పులుసు ఘుమ ఘుమలతో వీధి మొత్తం నోట్లో నీళ్లు ఊరడం ఖాయం.
నెల్లూరు జిల్లా వాసులకు చేపలకు విడదీయరాని బంధం ఉంది. కొర్రమీను దగ్గర నుంచి సొరచేప, పండుగప్ప, బొమ్మిడాయి గండి, బొచ్చ, చందమామ, నెత్తాళ్ళు ఇలా ఎన్నో రకాల చేపలు నెల్లూరులో దొరుకుతాయి. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులైతే నెల్లూరులో దొరికే బొమ్మిడాయిల పులుసు కోసం ఎగబడతారు. నెల్లూరులో పెట్టే చేపల పులుసు విధానం మనం కూడా తెలుసుకోవాలి కదా. నెల్లూరోళ్ల మాదిరిగా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ముందుగా బొమ్మిడాయిలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత గిన్నెలో గళ్ళు ఉప్పు వేసుకుని చేపలు వేసి జిగురు పోయేవరకూ రుద్దకోవాలి. ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సిలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సిలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని దళసరి గిన్నె పెట్టుకొని అవసరమైన మేరకు నూనె వేసుకోవాలి.
నూనె వేడెక్కిన తర్వాత మిర్చి, ఉల్లిపాయల పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత ఆ మిశ్రమంలో కారం వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత బొమ్మిడాయిల చేపలను అందులో వేసుకుని బాగా వేయించాలి. అలాగే చింతపండు గుజ్జులో నీరు పోసుకుని కలిపి దానిని పులుసులో పోయాలి. కరివేపాకు, కొత్తమీర వేసుకుని పులుసు దగ్గరపడే వరకూ మరిగించాలి. కాసేపటికి రుచికరమైన బొమ్మిడాయిలు పులుసు రెడీ. రాగిసంకటిలో బొమ్మిడాయిల పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఇలా ఎవరైనా సరే నెల్లూరు చేపల పులుసు పెట్టవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…