గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Naga Shaurya Father : పేకాట కేసులో అరెస్ట్ అయిన నాగ‌శౌర్య తండ్రి..!

Naga Shaurya Father : మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ అరెస్టయ్యారు. ఆయన్ను ఉప్పర్‌పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్‌ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌…

Naga Shaurya Father : పేకాట కేసులో అరెస్ట్ అయిన నాగ‌శౌర్య తండ్రి..!

Naga Shaurya Father : మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ అరెస్టయ్యారు. ఆయన్ను ఉప్పర్‌పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్‌ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఈ పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.

Naga Shaurya Father shiva linga prasad arrested by police

హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ఫాం హౌజ్‌ని 5 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాత గుత్తా సుమన్‌‌కు ఆ ఫామ్‌హౌస్ రెంట్‌కు ఇచ్చారు. ఈ క్రమంలో రెంటల్ అగ్రిమెంట్ తీసుకురావాలని శివలింగ ప్రసాద్‌ను పోలీసులు కోరుతూ నోటీసులు ఇష్యూ చేయగా, ఆయన స్పందించలేదు. రెంటల్ అగ్రిమెంట్ నిబంధనలు పాటించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలిసి కొన్ని రోజులుగా నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. దాంతో ఆయన అరెస్టు అనివార్యమైంది. నిన్నమొన్నటి వరకు నాగ శౌర్య తండ్రి పేరు ఈ కేసులో కాస్త తక్కువగానే వినిపించింది. అయితే ఇప్పుడు పోలీసులు సేకరించిన ఆధారాలతో ఆయన పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది . శ్రీరామ్‌ భద్రయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు.. నిజామాబాద్‌, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడాబాబులూ కూడా అందులో ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి