Naga Chaitanya : లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల విజయాల అనంతరం నాగచైతన్య మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం థాంక్ యూ అనే మూవీని కంప్లీట్ చేసిన చైతూ ఓ థ్రిల్లర్ సిరీస్‌లో నటిస్తున్నాడు. అలాగే త్వరలో పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. తరువాత డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో ఇంకో మూవీ చేయనున్నాడు. అయితే చైతూ మొదటి సారిగా హిందీలో నటించిన లాల్ సింగ్ చడ్డా అనే మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో అమీర్‌ఖాన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. కరీనా కపూర్ ఆయనకు జోడీగా యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చెందిన ట్రైలర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు.
అయితే ఈ ట్రైలర్‌ను చూసిన అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ ట్రైలర్‌లో చైతూ చాలా తక్కువ సమయం పాటు కనిపించాడు. ఇది అక్కినేని ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అయితే దీనిపై కొందరి వాదన ఎలా ఉందంటే.. సమంత బాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్ 2 అనే సిరీస్ చేసింది కదా. ఆమె నటించిన కారణంగా ఆ సిరీస్ ఇంకా హిట్ అయింది. దీంతో బాలీవుడ్‌లో సమంత మంచి పేరు తెచ్చుకుంది. కానీ చైతూ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. అందుకు లాల్ సింగ్ చడ్డా ట్రైలర్‌ను వారు కారణంగా చూపిస్తున్నారు. అందులో చైతూ అసలు ఎక్కువ సమయం పాటు కనిపించలేదు. అందుకనే సమంతలా బాలీవుడ్‌లో చైతూ రాణించలేకపోయాడు.. అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక నాగచైతన్య పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ట్రైలర్‌లో ఎక్కువ సమయం పాటు చూపించలేదు. కానీ సినిమాలో మాత్రం ఆయన పాత్ర నిడివి సుమారుగా 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఉత్తరాది ప్రేక్షకులు చైతూను గుర్తుంచుకుంటారా.. అన్నది సందేహంగా మారింది. పూర్తి స్థాయి నిడివి కలిగిన పాన్ ఇండియా మూవీలో నటిస్తే గుర్తింపు వస్తుంది. కానీ చైతూ ఇప్పుడు చేసిన సినిమాలో ఆయన పాత్ర చాలా తక్కువ సేపు ఉంటుంది. కనుక చైతూను పాన్ ఇండియా స్టార్‌గా గుర్తిస్తారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సినిమా విడుదలయ్యాక ఈ విషయంపై స్పష్టత రానుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…