Viral Video : రహదారిపై బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మన దగ్గర పత్రాలు అన్నీ ఉంటే ఓకే. లేదంటే మధ్యలో ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి చెక్ చేస్తే ఇబ్బందులు తప్పవు. అయితే ఇలాంటి సందర్భాలలో కొందరు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు పోలీసులు ఉన్నారన్న విషయాన్ని ముందుగానే పసిగట్టి వారి దగ్గరకు రాకుండానే ముందుగానే యూ టర్న్ తీసుకుని వెళ్తుంటారు. ఇక కొందరు పోలీసులు వెంట పడ్డా దొరకకుండా ముందుకు సాగుతారు. అయితే ఆ వ్యక్తి మాత్రం పోలీసులను ఒక రేంజ్‌లో మోసం చేశాడు. వారికి దొరికినట్లే దొరికి వెంటనే అక్కడి నుంచి యూ టర్న్ తీసుకుని పారిపోయాడు. ఈ సంఘటన తాలూకు వీడియో వైరల్‌గా మారింది.
రహదారిపై బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపేందుకు వెనుకాలే ఇద్దరు పోలీసులు ఇంకో బైక్ మీద వచ్చారు. అయితే ఆ వ్యక్తి రోడ్డుకు అవతలి వైపు ఆగాడు. దీంతో అతను ఆగాడులే అని చెప్పి పోలీసులు కాస్త లైట్ తీసుకున్నారు. అయితే వారు అతన్ని చేరుకునేలోపే అతను వెంటనే బైక్‌ను యూటర్న్ తీసి అక్కడి నుంచి మళ్లీ వెనక్కి వచ్చాడు. ఇక అతని కోసం ఇంకో ఇద్దరు పోలీసులు వెంబడించినా ఫలితం లేకపోయింది. అతను చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు.
ఈ వీడియోకు గాను ఇప్పటికే 19 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1.20 లక్షలకు పైగా లైక్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోకు గాను కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది హాలీవుడ్ లెవల్ స్టంట్ అని కొందరు కామెంట్ చేయగా.. ఈ స్టంట్‌ను పెట్టి ధూమ్ 5 సినిమా తీయాలని కొందరు కామెంట్లు చేశారు. చాలా మందీ ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…