గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Naga Chaitanya : అక్కడ సమంత పాస్‌.. నాగచైతన్య ఫెయిల్‌..?

Naga Chaitanya : లవ్‌ స్టోరీ, బంగార్రాజు చిత్రాల విజయాల అనంతరం నాగచైతన్య మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం థాంక్‌ యూ అనే మూవీని కంప్లీట్‌ చేసిన చైతూ ఓ థ్రిల్లర్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. అలాగే త్వరలో పరశురామ్‌…

Naga Chaitanya : అక్కడ సమంత పాస్‌.. నాగచైతన్య ఫెయిల్‌..?

Naga Chaitanya : లవ్‌ స్టోరీ, బంగార్రాజు చిత్రాల విజయాల అనంతరం నాగచైతన్య మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం థాంక్‌ యూ అనే మూవీని కంప్లీట్‌ చేసిన చైతూ ఓ థ్రిల్లర్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. అలాగే త్వరలో పరశురామ్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. తరువాత డీజే టిల్లు ఫేమ్‌ విమల్‌ కృష్ణ దర్శకత్వంలో ఇంకో మూవీ చేయనున్నాడు. అయితే చైతూ మొదటి సారిగా హిందీలో నటించిన లాల్‌ సింగ్‌ చడ్డా అనే మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో అమీర్‌ఖాన్‌ ముఖ్యమైన పాత్రలో నటించాడు. కరీనా కపూర్‌ ఆయనకు జోడీగా యాక్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చెందిన ట్రైలర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు.

అయితే ఈ ట్రైలర్‌ను చూసిన అక్కినేని ఫ్యాన్స్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ ట్రైలర్‌లో చైతూ చాలా తక్కువ సమయం పాటు కనిపించాడు. ఇది అక్కినేని ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అయితే దీనిపై కొందరి వాదన ఎలా ఉందంటే.. సమంత బాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్‌ 2 అనే సిరీస్‌ చేసింది కదా. ఆమె నటించిన కారణంగా ఆ సిరీస్‌ ఇంకా హిట్‌ అయింది. దీంతో బాలీవుడ్‌లో సమంత మంచి పేరు తెచ్చుకుంది. కానీ చైతూ మాత్రం ఆ విషయంలో ఫెయిల్‌ అయ్యాడని అంటున్నారు. అందుకు లాల్‌ సింగ్‌ చడ్డా ట్రైలర్‌ను వారు కారణంగా చూపిస్తున్నారు. అందులో చైతూ అసలు ఎక్కువ సమయం పాటు కనిపించలేదు. అందుకనే సమంతలా బాలీవుడ్‌లో చైతూ రాణించలేకపోయాడు.. అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Naga Chaitanya may not be impressed North audience
Naga Chaitanya

ఇక నాగచైతన్య పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ట్రైలర్‌లో ఎక్కువ సమయం పాటు చూపించలేదు. కానీ సినిమాలో మాత్రం ఆయన పాత్ర నిడివి సుమారుగా 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఉత్తరాది ప్రేక్షకులు చైతూను గుర్తుంచుకుంటారా.. అన్నది సందేహంగా మారింది. పూర్తి స్థాయి నిడివి కలిగిన పాన్ ఇండియా మూవీలో నటిస్తే గుర్తింపు వస్తుంది. కానీ చైతూ ఇప్పుడు చేసిన సినిమాలో ఆయన పాత్ర చాలా తక్కువ సేపు ఉంటుంది. కనుక చైతూను పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తిస్తారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సినిమా విడుదలయ్యాక ఈ విషయంపై స్పష్టత రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి