Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. దీనికి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీలో రాశి ఖన్నాతోపాటు అవికాగోర్, మాళవికా నాయర్‌లు ఇతర హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ జూలై 22వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
థాంక్ యూ చిత్రానికి గాను నాగచైతన్య, రాశి ఖన్నా వేగంగా ప్రమోషన్స్ చేపడుతున్నారు. పలు చానల్స్‌కు వీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఇద్దరూ పలు విషయాలను షేర్ చేశారు. రాశి ఖన్నాకు థ్యాంక్స్ చెప్పేందుకు ఒక ఇంటర్వ్యూ సరిపోదని, వెబ్ సిరీస్ తీయాలని.. అది 8 పార్ట్‌లు అవుతుందని తెలిపాడు. ఇక రాశి ఖన్నా కూడా తాను చైతూకు అనేక విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలని తెలియజేసింది.
ఈ మూవీ కథ వినగానే తనలో ఏదో తెలియని ఫీలింగ్ వచ్చిందని చైతూ తెలిపాడు. తన జీవితంలోని స్పెషల్ వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాలని అనిపించిందని అన్నాడు. అందుకనే ఈ మూవీలో నటించానని తెలిపాడు. కథ బాగుందని, అందుకనే నటించానని రాశి ఖన్నా తెలియజేసింది. తాను కరోనా టైమ్‌లో రోజూ ఫోన్ చెక్ చేసుకునేవాడినని, సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాలక్షేపం చేసేవాడినని, రోజూ లేవడం, తినడం, సోషల్ మీడియాలో కామెంట్స్ చూసుకోవడం.. ఇదే కరోనా లాక్ డౌన్‌లో తన డైలీ రొటీన్ అయిందని.. చైతూ తెలిపాడు. అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలపగా.. రాశి మాట్లాడుతూ.. చైతూ రోజూ కేవలం 4 నిమిషాల పాటు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ చూస్తాడని తెలిపింది.
రోజూ రష్యాలో -14 నుంచి -16 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టించే చలిలో షూటింగ్ చేసినట్లు రాశి తెలియజేసింది. ఇక తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడిన చైతూ ఓ ఆసక్తికరమైన విషయం తెలియజేశారు. అప్పట్లో 9వ తరగతి చదువుతున్న రోజుల్లో ముగ్గురం స్నేహితులం ఉండేవాళ్లం. ముగ్గురం ఒకే అమ్మాయిని లవ్ చేశాం. కానీ ఆ అమ్మాయి మా హృదయాలను ముక్కలు చేసి వెళ్లిపోయింది. తరువాతే మేం ఇంకా మంచి స్నేహితులం అయ్యాం.. అని చైతూ తెలిపాడు. కాగా చైతూ చేసిన ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…