Naga Chaitanya : బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారిద్దరూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఎంతో హంగూ ఆర్భాటాలతో పెళ్లి చేసుకున్న ఈ జంట చూడ ముచ్చటగా ఉందని అందరూ ఆకాశానికి ఎత్తేశారు. ఆ తరువాత 4 ఏళ్లకే 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి వారిద్దరూ మీడియాకి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ తాము విడిపోవడానికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇంత వరకు ఎవరూ పంచుకోలేదు.
కేవలం ఇద్దరికీ అభిప్రాయ బేధాల వల్లే దూరమైనట్టు చెప్పారు. అయితే ఈ మధ్య సమంత కాఫీ విత్ కరణ్ అనే హిందీ టీవీ షో లో మాట్లాడుతూ తమ ఇద్దరినీ ఒక గదిలో బంధించి ఉంచితే మాత్రం పదునైన వస్తువులేవి దగ్గర్లో లేకుండా చూడాలని చెప్పింది. అంటే ఇద్దరి మధ్య అంత ద్వేషం, మనస్పర్ధలు ఉన్నాయని ఆమె చెప్పకనే చెప్పిందని అంటున్నారు.
ఇక నాగచైతన్య కూడా ఇటీవల తాను నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ ప్రచార కార్యక్రామాల్లో భాగంగా ఓ హిందీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ షోలోని రిపోర్టర్.. సమంత ఇప్పుడు మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని నాగచైతన్యని అడగ్గా.. హాయ్ అని చెప్పి ఒక హగ్ ఇస్తా.. అని చెప్పాడు.
ఇదే ఇంటర్వ్యూలో నాగచైతన్య తమ విడాకుల విషయం గురించి ఇలా చెప్పారు. తాము విడిపోవడానికి గల కారణాలను ఇంకా లోతుగా ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదని, ఏదైతే చెప్పదలుచుకున్నామో అప్పుడే ఇద్దరం చెప్పేశామని అన్నారు. తన ఫ్యామిలీ, స్నేహితులు, బంధువులకి అంతా తెలుసని, ప్రపంచానికి అంతా తెలియాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇక అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీతో నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరో స్నేహితుడుగా ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…