Thavudu : మనిషి జీవనానికి పోషక విలువలు గల ఆహారం అత్యంత అవసరం. అది లేకపోతే జీవించడం సాధ్యంకాదు. గాలి, నీరు, ఆహారం కలుషితమైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వీటితో పాటు శరీర వ్యాయామం ఉన్నట్లయితే దృఢంగా పని చేయగలుగుతారు. మనస్సు, శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా జీవించడానికి తగినన్ని పోషక విలువలు అందించగల ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.
మనం అనేక పోషకాలను అందించే అత్యంత న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం. ఈ పదం వింటే ఇది మన వల్ల కాదు అనిపిస్తుంది. కానీ దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే తప్పకుండా ప్రయత్నిస్తారు. అదే తవుడు. 100 గ్రాముల తవుడుని తీసుకుంటే 316 క్యాలరీల శక్తి లభిస్తుంది. అంటే ఇది చికెన్, మటన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. జంతువులకు తవుడు పెట్టి మనం మాత్రం పోషకాలు లేని తెల్లని బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం.
ఇందులో ప్రోటీన్ 14 గ్రాములు ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ 50 గ్రాములు ఉంటాయి. ఫ్యాట్ 20 గ్రాములు ఉంటుంది. అందువల్లనే తవుడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తీస్తారు. ఫైబర్ 21 గ్రాములు ఉంటుంది. తెల్లని బియ్యంలో ఒక గ్రాము ఫైబర్ కూడా ఉండదు. ఈ క్రమంలోనే పేగుల శుభ్రతకు, పేగులలో మంచి బాక్టీరియా పెరుగుదలకు, మలబద్ధకం రాకుండా చేయడానికి తవుడులో ఉండే ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది.
అన్నిటికంటే ఎక్కువగా శరీరంలో రక్తం తయారు కావడానికి కావలసిన ఐరన్ తవుడులో పుష్కలంగా ఉంటుంది. ఇందులో 35 నుంచి 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందువల్ల రక్తం తక్కువగా ఉండేవారు ఐరన్ ట్యాబ్లెట్లకు బదులుగా తవుడును వాడుకుంటే చాలా మంచిది. ఎముకల దృఢత్వానికి కాల్షియంతోపాటు ఫాస్పరస్ కూడా కావాలి. ఇందులో దాదాపుగా1677 మిల్లీగ్రాముల ఫాస్పరస్ ఉంటుంది. అలాగే పొటాషియం1485 మీల్లి గ్రాములు ఉంటుంది.
మెగ్నిషియం 781 మిల్లి గ్రాములు, రక్షణ వ్యవస్థకు కావాల్సిన జింక్ 8 మిల్లి గ్రాములు ఉంటుంది. రక్షణ వ్యవస్థకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే సెలీనియం15.6 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా తవుడులో పుష్కలంగా లభిస్తాయి. అందువలన తవుడును శరీరానికి కావలసిన పోషకాల గని అంటారు. ఇలాంటి తవుడు రైస్ మిల్లులలో బాగా లభిస్తుంది. ఈ క్రమంలోనే తవుడును పుల్కా లాంటి వాటిలోనూ, కొంచెం పొడి అన్నంలోనూ కలుపుకొని తినవచ్చు. దీంతో పైన తెలిపిన విధంగా అనేక లాభాలను పొందవచ్చు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…