Murali Mohan : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌పై ముర‌ళీ మోహ‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌.. వారిద్ద‌రూ అలా ఉండేవార‌ట‌..!

Murali Mohan : టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్‌గా పేరుగాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోయి సుమారుగా 9 నెల‌లు అవుతోంది. ఈ క్ర‌మంలోనే వీరికి సంబంధించి వార్త‌లు త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటాయి. అస‌లు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విష‌యం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే వీరి విడాకుల విష‌య‌మై అనేక వార్త‌లు పుకార్లుగా మారి షికార్లు చేశాయి. అయితే తాము ఎందుకు విడిపోయామ‌నే విష‌యాన్ని ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హిరంగంగా చెప్ప‌లేదు. కానీ వీరిపై ప్ర‌స్తుతం సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ముర‌ళీ మోహ‌న్‌.. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌కు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో మూడు అపార్ట్‌మెంట్ల‌ను క‌ట్టాన‌ని తెలిపారు. తాను, త‌న కుమారుడు, కుటుంబ స‌భ్యులు ఉండేందుకు వాటిని క‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. అయితే వాటిని చూసి నాగ‌చైత‌న్య ముచ్చ‌ట‌ప‌డ్డాడ‌ని.. ఒక అపార్ట్‌మెంట్‌ను త‌న‌కు అమ్మాల‌ని కోరాడ‌ని తెలిపారు.

Murali Mohan

అయితే తాను, త‌న ఫ్యామిలీ ఉండేందుకు ఆ అపార్ట్‌మెంట్ల‌ను క‌ట్టాన‌ని.. వాటిని అమ్మ‌బోన‌ని చైత‌న్య‌కు చెప్పాన‌ని.. కానీ చైత‌న్య త‌న తండ్రి నాగార్జున‌కు ఈ విష‌యం చెప్ప‌గా.. నాగార్జున వ‌చ్చి త‌న‌ను క‌ల‌సి అపార్ట్‌మెంట్ అమ్మాల‌ని కోరార‌ని.. తెలిపారు. దీంతో నాగార్జున‌పై ఉన్న గౌర‌వంతో ఒక అపార్ట్‌మెంట్‌ను చైత‌న్య‌కు అమ్మాన‌ని వివ‌రించారు.

తాను అమ్మిన అపార్ట్‌మెంట్‌లోనే చైత‌న్య‌, స‌మంత ఉండేవార‌ని.. ముర‌ళీ మోహ‌న్ తెలియ‌జేశారు. అయితే వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. పార్టీలు కూడా చేసుకునేవార‌ని.. ఒక రోజు ప‌ని మ‌నిషి వ‌చ్చి స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్నార‌ని చెప్పింద‌ని.. దాంతో ఆ మాట‌లు విని షాక‌య్యాన‌ని అన్నారు. అయితే అప్ప‌టికే చైత‌న్య హోట‌ల్‌లో ఉంటున్న‌ట్లు తెలిసింద‌ని.. దీంతో వారి విడాకులు ఫిక్స్ అయ్యాయ‌ని తెలుసుకున్నాన‌ని.. త‌రువాత వారు విడిపోయార‌ని.. వివ‌రించారు.

అయితే త‌న క‌ళ్ల ముందు మాత్రం వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవార‌ని.. ఎప్పుడూ గొడ‌వ ప‌డేవారు కూడా కాద‌ని.. అలాంటి జంట ఎందుకు విడిపోయిందో ఇప్ప‌టికీ త‌న‌కు తెలియ‌ద‌ని.. ముర‌ళీ మోహ‌న్ అన్నారు. కాగా ముర‌ళీ మోహ‌న్ చేసిన ఈ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM