OTT : వారం మారిందంటే చాలు.. ఈ వారం ఓటీటీల్లో ఏమేం సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి.. అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్ లు కూడా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విశ్వక్‌సేన్, రుక్సార్ ధిల్లాన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సాధించింది. కానీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. ఇక మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జూన్ 3వ తేదీన ఈ మూవీని ఆహా ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయనున్నారు. ఓటీటీలో ఈ మూవీ హిట్ అవుతుందేమో చూడాలి.
మళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన జనగణమణ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నారు.
నందమూరి తారకరత్న, అజయ్, ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన 9 అవర్స్ అనే సిరీస్‌ను జూన్ 2వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. యాక్షన్ డ్రామా జోనర్‌లో దీన్ని తెరకెక్కించారు.
ది బాయ్స్ అనే సిరీస్‌కు చెందిన 3వ సీజన్ ఈ వారం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సిరీస్‌ను జూన్ 3వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…