12th Man Review : మోహ‌న్ లాల్ న‌టించిన 12th Man మూవీ రివ్యూ..!

12th Man Review : వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌లో న‌టించ‌డంలో మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కు మంచి పేరుంది. ఆయ‌న త‌న వ‌య‌స్సుకు త‌గిన చిత్రాల‌ను చేస్తుంటారు. తెలుగులోనూ ఆయ‌న న‌టించిన అనేక చిత్రాలు ఇప్ప‌టికే ఘ‌న విజ‌యం సాధించాయి. ఇక ఆయ‌న లేటెస్ట్‌గా 12th Man సినిమాతో మ‌రోమారు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని నేరుగా రిలీజ్ చేశారు. మ‌ళయాళం భాష‌లో ఇంగ్లిష్ స‌బ్ టైటిల్స్‌తో ఈ సినిమాను వీక్షించ‌వ‌చ్చు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

చంద్ర‌శేఖ‌ర్ (మోహ‌న్ లాల్‌) పోలీస్ అధికారి. డీఎస్‌పీగా ప‌నిచేస్తుంటాడు. అయితే ఓ కేసులో ఈయ‌న స‌స్పెండ్ అవుతారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఈయ‌న ఓ రిసార్టులో పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఆ రిసార్ట్‌కే కొంద‌రు ఓ పార్టీ నిమిత్తం వ‌స్తారు. ఓ వ్య‌క్తి ఇచ్చే బ్యాచిల‌ర్ పార్టీకి గాను అత‌ని స్నేహితులు, వారి భార్య‌లు మొత్తం క‌లిపి 10 మంది.. అత‌నితో స‌హా అయితే 11 మంది పార్టీకి వ‌స్తారు. అదే రిసార్ట్‌లో వారు మొత్తం 11 మంది పార్టీ చేసుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే వారు ఒక డేంజ‌ర‌స్ గేమ్ ఆడుతారు. దీని కార‌ణంగా అంద‌రూ డిస్ట‌ర్బ్ అవుతారు. ఇంత‌లో హ‌ఠాత్తుగా ఆ 11 మందిలో ఒక మ‌హిళ చ‌నిపోతుంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డే రిసార్ట్‌లో ఉన్న చంద్ర‌శేఖ‌ర్ కేసును విచారించ‌డం మొద‌లు పెడ‌తాడు. చివ‌రికి ఆ 10 మందిలో నిందితుడు లేదా నిందితురాలు ఎవ‌రు ? అనే విష‌యాన్ని చంద్ర‌శేఖ‌ర్ ఛేదిస్తాడు. అయితే ఈ మూవీలో ఇంకా అస‌లు ఏం జ‌రిగిందో తెల‌సుకోవాలంటే.. దీన్ని ఓటీటీలో చూడాల్సిందే.

12th Man Review

సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఆరంభంలో కొద్దిగా నెమ్మ‌దిగా సాగినా.. హ‌త్య సీన్ త‌రువాత చాలా వేగంగా సీన్స్ మారుతుంటాయి. 11 మందిలో ఒకామె హత్య‌కు గురైతే మిగిలిన వారిలో ఎవ‌రు ఆ హ‌త్య చేశారు అనే విష‌యాన్ని చాలా తెలివిగా చంద్ర‌శేఖ‌ర్ ఛేదిస్తాడు. ఇక్క‌డే ర‌చ‌యిత ప్ర‌తిభ క‌న‌బ‌డింది. ఇక ద‌ర్శ‌కుడు కూడా అన్ని క‌ల‌గాపుల‌గంలా ఉండే సీన్ల‌ను ఒక‌దాని త‌రువాత ఒక‌టి ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా విడ‌మ‌రిచి చెబుతూ సినిమాను ముందుకు తీసుకెళ్తాడు. దీంతో ప్రేక్ష‌కులకు ప్ర‌తి విష‌యం సుల‌భంగానే తెలిసిపోతుంది. అయితే మ‌ధ్యలో క‌న్నార్ప‌కుండా.. ఒక్క డైలాగ్ కూడా మిస్ కాకుండా చూడాలి. అప్పుడే ప్ర‌తి చిన్న డిటెయిల్ తెలుస్తుంది. కేసు ఎలా ప‌రిష్కారం అయిందో అర్థ‌మ‌వుతుంది.

ఇక మోహ‌న్ లాల్ మరోసారి ఈ సినిమాలో జీవించార‌నే చెప్ప‌వ‌చ్చు. మిగిలిన వారంద‌రూ త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర న‌టించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌, ఫొటోగ్ర‌ఫీ బాగున్నాయి. మోహ‌న్‌లాల్ సినిమా అంటే క‌చ్చితంగా క‌థ‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. అలాగే దీంట్లోనూ ప్రాధాన్య‌త క‌ల్పించారు. క‌నుక స‌స్పెన్స్‌, క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ త‌ర‌హా సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారు ఈ మూవీని త‌ప్ప‌క చూడాలి.. అని చెప్ప‌వ‌చ్చు. ఎంతో థ్రిల్‌ను అందిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM