Mehreen : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలనే తెచ్చి పెట్టింది. దాదాపుగా రూ.84 కోట్ల మేర నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే నిర్మాతలను ఆదుకుంటానని చరణ్‌తోపాటు దర్శకుడు కొరటాల భరోసా ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట మూవీ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ టాక్ పక్కన పెడితే.. ఓవరాల్‌గా ఆచార్య కన్నా సర్కారు వారి పాట మూవీ కాస్త బెటరే అని అంటున్నారు. దీంతో మహేష్ బాబు మూవీకి ఆశించిన మేర కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొదటి వారం రోజులు గడిస్తే సర్కారు వారి పాట భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. ఇక ఈనెలలోనే ఎఫ్3 మూవీతో వరుణ్ తేజ్, వెంకటేష్ వస్తున్నారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఎఫ్3 మూవీ కామెడీ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతోంది. దీంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారని ఆశించవచ్చు. ఎఫ్2 కన్నా ఎఫ్3లో కామెడీ డోస్ కాస్త ఎక్కువగానే ఉందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చాలా వరకు తెలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఎఫ్3 ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుండగా.. టిక్కెట్ల ధరలను మాత్రం పెంచేది లేదని చెప్పారు. ఇది సినిమాకు కలసి వచ్చే సానుకూల అంశం అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్‌లు నటించారు. వీరు తమ గ్లామర్‌ను ఈ మూవీలో ఒలకబోశారని ట్రైలర్‌ను చూస్తే చెప్పవచ్చు. దీంతో కామెడీతోపాటు గ్లామర్ ట్రీట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నారు.
ఇక ఎఫ్3 మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమాకు చెందిన ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగానే ఓ వైపు తమన్నా.. మరోవైపు మెహ్రీన్ గ్లామర్ డ్రెస్సులను ధరించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా మెహ్రీన్ ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఆమె లైట్ పింక్ కలర్ డ్రెస్ ధరించి వచ్చింది. వాస్తవానికి కింద బాగానే ఉన్నా.. పైన ధరించింది బికినీని పోలి ఉంది. దీంతో మెహ్రీన్ గ్లామర్‌కు ఫిదా అవుతున్నారు. కుర్రకారు మతులు పోయేలా ఆమె ఆ డ్రెస్‌ను ధరించింది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. గ్లామర్ ట్రీట్‌లతో సినిమాలు హిట్ కావు. మంచి కథ, అంతకు మించిన కథనం.. డైలాగ్స్, పాటలు, కామెడీ సీన్లు.. వంటివన్నీ తోడైతేనే సినిమా హిట్ అవుతుంది. మరి ఎఫ్3 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…