గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Meena : భ‌ర్త మ‌ర‌ణం త‌రువాత మీనా చేసిన ఆ ప‌నికి.. షాక‌వుతున్న నెటిజ‌న్లు..

Meena : ఒకప్పుడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ మీనా. మీనా స్వతహాగా మళ‌యాళ సినీ పరిశ్రమకు చెందినది అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ…

Meena : భ‌ర్త మ‌ర‌ణం త‌రువాత మీనా చేసిన ఆ ప‌నికి.. షాక‌వుతున్న నెటిజ‌న్లు..

Meena : ఒకప్పుడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ మీనా. మీనా స్వతహాగా మళ‌యాళ సినీ పరిశ్రమకు చెందినది అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ఈక్రమంలో మీనా నటించిన పలు లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు సినీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. అయితే రీసెంట్ గా భర్తను కోల్పోయిన మీనా కొన్నాళ్ళు ఇంటికే పరిమితమయ్యింది.

ఈమధ్యే మళ్ళీ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. తనకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రంభ, సంఘవి, సంగీత లాంటి స్టార్స్ ఫ్యామిలీస్ తో కలిసి ఇటీవల మీనా ఇంటికి వెళ్లారు. అక్కడ వారు సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 16న మీనా పుట్టినరోజు. ఆమె తన 46వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంది. కాకపోతే ప్రతి సంవత్సరం తన బర్త్ డేను భర్త పక్కనే ఉండి జరిపించేవాడు. కానీ ఈ సంవత్సరం ఆయన ఊహించిన విధంగా మరణించడంతో మీనా తన పుట్టిన రోజును ప్రాణ స్నేహితుల మధ్య జరుపుకుంది.

Meena celebrated her birthday with friends
Meena

అసలు ఈ సంవత్సరం మీనా పుట్టినరోజు జరుపుకోనని నిర్ణయించుకుంది కానీ తన ప్రాణ స్నేహితులు పట్టుబ‌ట్టి ఆమెకు సర్ ప్రైజ్ గా పుట్టినరోజు వేడుకలను జరిపారు. దీంతో పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి క్షణాల్లోనే వైరల్ గా మారాయి. అయితే దీనిపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. భర్త చనిపోయి కనీసం సంవత్సరం కూడా కాకముందే మీనా ఇలా నవ్వుతూ తూలుతూ ఉండడం ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మీనా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి