Manchu Vishnu : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం..!

October 16, 2021 7:16 PM

Manchu Vishnu : అక్టోబర్ 10వ తేదీన జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై అధిక మెజార్టీతో గెలిచిన మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‎లో జరిగిన ఈ కార్యక్రమంలో మంచు విష్ణు ఆయన ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

Manchu Vishnu took oath as maa president

ఈ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదే విధంగా మంచు విష్ణు కుటుంబ సభ్యులు, మాజీ మా అధ్యక్షుడు నరేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇకపోతే ప్రకాష్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది వారి పదవులకు రాజీనామా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ 11 మంది ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం.

మంచు ప్రమాణస్వీకారోత్సవం అనంతరం పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కాగా ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథులుగా రావాల్సి ఉండగా వారు మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment