Viral Video : వామ్మో.. మ‌రుగుతున్న నూనెలో చేయి పెట్టి వ‌డ‌ల‌ను వేస్తున్నాడు.. వీడియో..!

August 3, 2022 9:40 AM

Viral Video : గారెలు, వ‌డ‌లు, ప‌కోడీలు.. ఇలాంటి చిరుతిళ్ల‌ను స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటుంటారు. వేడి వేడిగా వీటిని వండుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వీటిని తింటే రుచి అదిరిపోతుంది. అయితే వీటిని వేయించేందుకు మ‌నం వివిధ ర‌కాల నూనెల‌ను వాడుతుంటారు. ఎవ‌రి ఇష్టానికి అనుగుణంగా నూనెల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇక నూనెలో వీటిని కాల్చేట‌ప్పుడు మ‌నం గరిటెను ఉపయోగిస్తాం. గ‌రిటెతోనే వాటిని రెండు వైపులా తిప్పుకుని కాల్చుతాం. అయితే ఆ వ్య‌క్తి మాత్రం గ‌రిటెను వాడ‌డం లేదు. చేతినే ఉప‌యోగిస్తున్నాడు. స‌ల‌స‌లా కాగే నూనెలో చేయి పెట్టి వ‌డ‌ల‌ను వేయిస్తున్నాడు. చూస్తేనే షాక్‌కు గుర‌వుతారు.

వ‌డ‌లు, గారెలు వంటి నూనె ప‌దార్థాల‌ను మ‌నం నూనెలో బాగా వేయిస్తాం. అందుకు గ‌రిటెను ఉప‌యోగిస్తాం. కానీ ఆ వ్య‌క్తి మాత్రం త‌న చేతినే గ‌రిటెలా వాడుతున్నాడు. నూనెలో వేగుతున్న వ‌డ‌ల‌ను చేత్తోనే అటు, ఇటు తిప్పుతున్నాడు. ఇక అవి కాలిన త‌రువాత వాటిని చేత్తోనే బ‌య‌ట‌కు తీస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను అలా వ‌డ‌ల‌ను త‌యారు చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

man put hand in boiling oil viral video
Viral Video

చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. మ‌రుగుతున్న నూనెలో చేతిని అలా ఎలా పెడుతున్నాడు.. అనే విష‌యం అర్థం కాక నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. అస‌లు అలా సాధ్య‌మ‌వుతుందా.. అని సందేహాలను వ్య‌క్తం చేస్తున్నారు. ఇక అత‌ని టాలెంట్ చూసి అత‌న్ని మెచ్చుకుంటున్నారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో ఎంతో మందిని ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment