Diamond : అదృష్టం అనేది జీవితంలో ఎవరినైనా ఒక్కసారి మాత్రమే వరిస్తుంది. అది వరించినప్పుడు రాత్రికి రాత్రే కొందరు కోటీశ్వరులు అవుతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాగే జరిగింది. ఎన్నో ఏళ్లుగా వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభించింది. అత్యంత ఖరీదైన వజ్రం వారికి లభించింది. దీంతో వారు కోటీశ్వరులు అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఉన్న సుశీల్ శుక్లా కుటుంబం గత కొన్నేళ్ల నుంచి ఇటుకల బట్టీని నడుపుతోంది. ఈ బట్టీ కోసం మట్టిని కృష్ణ కళ్యాణ్‌పూర్ ఏరియా నుంచి తెస్తుంటారు. అయితే తాజాగా సుశీల్ కుటుంబం అలా సేకరించిన మట్టిని ప్రాసెస్ చేస్తుండగా.. అందులోంచి ఒక వజ్రం బయట పడింది. దాని ఖరీదు రూ.1.20 కోట్లని తేలింది. అది 26.11 క్యారెట్ల వజ్రం. దీంతో సుశీల్ కుటుంబం రాత్రికి రాత్రే ధనిక కుటుంబంగా మారింది. అలా సుశీల్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
అయితే సదరు ప్రాంతం వజ్రాలకు నిలయం. గతంలో ఎంతో మంది ఆ ప్రాంతంలో వజ్రాలను సాధించారు. అనేక చోట్ల వజ్రాలు కొందరికి లభించాయి. అందువల్ల గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా సుశీల్‌కు ఓ వజ్రం లభించింది. దీంతో దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఏదైనా బిజినెస్ చేసుకుంటానని చెబుతున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…