Fish : అదృష్టం అనేది ఎవరినీ అంత సులభంగా వరించదు. వరిస్తే మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. అవును.. ఇలాంటి సంఘటనల గురించి గతంలో మనం అనేక సార్లు చదివాం. కోల్‌కతాలోనూ తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కోల్‌కతాలోని తూర్పు మిడ్నపూర్ లో ఉన్న దిఘా అనే ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు మనోరంజన్ ఖండాకు అరుదైన చేపలు లభించాయి. గత శనివారం ఆయన, ఇంకొందరు మత్స్యకారులు కలిసి చేపలకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారికి అత్యంత అరుదైన “తేలియా భోలా” చేపలు చిక్కాయి. మొత్తం 121 చేపలు వలలో పడ్డాయి. వాటిని అక్కడి మోహన చేపల మార్కెట్‌లో విక్రయించాడు. దీంతో అతనికి రూ.2 కోట్లు వచ్చాయి. అలా అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
తేలియా భోలా చేపలు అత్యంత అరుదైనవి. అవి ఎప్పుడో ఒకసారి గానీ వలలో పడవు. ఈ క్రమంలో మనోరంజన్‌ను చేపలు అదృష్టం రూపంలో వరించాయి. ఏకంగా 121 చేపలు వలలో పడడంతో అతని పంట పండింది. ఈ చేపల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటి లివర్‌లోని ఆయిల్ నుంచి పలు ఔషధాలను తయారు చేస్తారు. అలాగే ఈ చేపల చర్మానికి సైతం అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. వీటి చర్మం కేజీకి రూ.85వేల మేర ఉంటుంది. అందుకనే ఈ చేపలు అంత ధర పలుకుతుంటాయి. ఏది ఏమైనా.. మనోరంజన్‌ను మాత్రం ఆ చేపలు అదృష్టంలా వరించాయి. వాటితో అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. కరోనా సమయంలో తమకు చాలా నష్టాలు వచ్చాయని, ఈ దెబ్బతో ఆ నష్టాలన్నింటినీ భర్తీ చేసుకోగలిగానని.. మనోరంజన్ తెలిపాడు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…