Malaika Arora : ఎరుపు రంగు డ్రెస్‌లో సెగ‌లు రేపుతున్న‌.. గ‌బ్బ‌ర్ సింగ్ బ్యూటీ..!

May 5, 2022 9:48 AM

Malaika Arora : బాలీవుడ్ ముద్దుగుమ్మ మ‌లైకా అరోరా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. తాజాగా రెడ్ లెహంగాలో ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు చూపిస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తోంది. ప్ర‌స్తుతం మ‌లైకా అరోరా మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Malaika Arora latest red color dress photos trending
Malaika Arora

ఇటీవల ముంబైకి సమీపంలోని పన్వేల్‌లో మలైకా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విష‌యం తెలిసిందే. డ్రైవర్ చేతిలో కారు అదుపు తప్పడంతో రాజ్ థాక్రే మీటింగ్‌కు వెళ్తున్న ముగ్గురు మహా నిర్మాణ్ సేన సమితి కార్యకర్తలను ఢీకొట్టింది. దాంతో వారికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మలైకా అరోరా తలకు గాయాలు అవ్వడం తెలిసిందే. దీంతో గాయాలైన వారిని నవీ ముంబైలోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనపై మాట్లాడిన మ‌లైకా సినిమాలో జ‌రిగిన‌ట్టే అనిపించింద‌ని పేర్కొంది.

మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించిన మలైకా స్పెషల్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయ్యింది. తెలుగులోనూ మహేశ్‌బాబు అతిథి, పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. అయితే మ‌లైకా కొన్నాళ్లుగా అర్జున్ క‌పూర్‌తో ప్రేమలో మునిగితేలుతున్న విష‌యం తెలిసిందే. అర్జున్‌ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటంతో వీరు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలా కాలంగా డేటింగ్‌ లో ఉన్న జంట ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment