భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లంను ఉపయోగిస్తున్నారు. అల్లం మసాలా పదార్థం కిందకు వస్తుంది. దీన్ని మసాలా వంటకాల్లో ఎక్కువగా వేస్తుంటారు. ఇది ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అల్లంకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో అనేక ఔషధాలను తయారు చేస్తున్నారు కూడా. అయితే అల్లంను తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అల్లంతో నీళ్లను తయారు చేసి రోజూ పరగడుపునే తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. అల్లంతో ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లను తీసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్కను వేసి సన్నని మంటపై నీళ్లను మరిగించాలి. నీళ్లను ఇలా 10 నిమిషాల పాటు మరిగించాక వడకట్టాలి. దీంతో అల్లం నీళ్లు తయారవుతాయి. ఇందులో రుచి కోసం ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న అల్లం నీళ్లను రోజూ పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా రోజూ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అల్లంలో కోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీని కారణంగా శరీర మెటబాలిజం పెరుగుతుంది. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అలాగే కండరాల పనితీరు మెరుగు పడుతుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. వికారం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు రోజూ అల్లం నీళ్లను తాగుతుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది. అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇక శరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలోనూ అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
అల్లం నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇక ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు అయినా సరే తగ్గుతాయి. ఇలా అల్లం నీళ్లు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కనుక వాటిని రోజూ తాగాల్సిందే.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…