Mahesh Babu : కేజీఎఫ్ 2 మ‌హేష్ బాబుకు న‌చ్చ‌లేదా ? అందుక‌నేనా ఇప్ప‌టి వ‌ర‌కు దానిపై ఏమీ కామెంట్ చేయ‌లేదు..?

April 22, 2022 1:33 PM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్ర‌ముఖుల బ‌ర్త్ డేల‌కి శుభాకాంక్ష‌లు అందించ‌డ‌మే కాకుండా, చిన్న‌, పెద్ద సినిమాల‌కు రివ్యూలు ఇస్తూ వ‌స్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా అంద‌రి కన్నా ముందే మ‌హేష్ త‌న స్పంద‌న తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 విష‌యంలో మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. కేజీఎఫ్ 2 పై మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా మహేష్‌కి నచ్చకపోవడంతోనే ఆయ‌న‌ ట్వీట్‌ చేయలేదని సోషల్‌ మీడియాలో కొన్ని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Mahesh Babu not commented on KGF 2 what is the reason
Mahesh Babu

మరికొంతమంది మాత్రం సర్కారు వారి పాటతో బిజీగా ఉండడంతో చూసే అవకాశం రాలేదని అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్ఆర్ఆర్, పుష్పతోపాటు ప‌లు చిత్రాల గురించి మహేష్ ట్వీట్ చేశారు. కేజీఎఫ్‌2 విష‌యంలో ఆయ‌న‌ మౌనం గాసిప్ రాయుళ్లు మాట్లాడుకునేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్ర‌ముఖులు కేజీఎఫ్ 2 చిత్రాన్ని మెచ్చుకోగా, మహేష్ మాత్రం సైలెంట్ గా ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి . మ‌రి ఇప్ప‌టికైనా మ‌హేష్ స్పందిస్తారా.. అనేది చూడాలి.

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమాను రూపొందించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారం చేస్తోంది. హిందీ వెర్షన్ లో ఈ సినిమా రూ.250 కోట్ల మార్కును టచ్ చేసింది. చాలా వేగంగానే రూ.300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఫుల్లుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment