Evaru Meelo Koteeshwarulu : మ‌హేష్ బాబుతో సంద‌డి చేయ‌నున్న ఎన్టీఆర్.. షో ఎప్పుడు టెలికాస్ట్ కానుందో తెలుసా?

October 27, 2021 11:32 AM

Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మ‌రో వైపు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. గేమ్ ఆడిస్తూనే మ‌ధ్య మ‌ధ్య‌లో త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. ఈ షోకి సామాన్యుల‌తోపాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా గెస్ట్‌లుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

mahesh babu in Evaru Meelo Koteeshwarulu show with ntr episode time

క‌ర్టెన్ రైజ‌ర్ ఎపిసోడ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు. ఈ మొత్తాన్ని ఆయ‌న ఛారిటీకి అందించారు. ఇక కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, స‌మంత కూడా ఈ షోలో సంద‌డి చేశారు. మ‌హేష్ బాబు కూడా ఈ షోకి గెస్ట్ గా వ‌చ్చిన‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే మ‌హేష్‌తో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ఎపిసోడ్ పూర్తి చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా లీకైంది. షో ఎప్పుడు టెలికాస్ట్ ఎప్పుడు అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సీజన్ ను నవంబర్‌ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ లో మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment