OTT : ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వారం మారితే థియేటర్ల వద్ద సందడి నెలకొనేది. కానీ ఇప్పుడు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. కొత్త సినిమా ఏది వచ్చినా.. నెల రోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుంది కదా.. అని భావిస్తున్నారు. కనుకనే థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. ఇక ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఓటీటీ యాప్‌లు కూడా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను వారం వారం రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికే ఇందులో అందుబాటులో ఉంది. కానీ పే పర్ వ్యూ పద్ధతిలో చూడాల్సి వస్తోంది. కానీ ఈ నెల 23వ తేదీ నుంచి ఈ మూవీని ఉచితంగానే చూడవచ్చు. అందుకు గాను ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయనుంది.
ఇక తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన నెంజుకు నీది అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా ఓటీటీలో ఈ వారమే రిలీజ్ అవుతోంది. ఈ మూవీని కూడా ఈ నెల 23వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సోనీ లివ్‌లో ఈ మూవీని చూడవచ్చు.
మిస్టర్ బీన్‌గా ఎంతో పేరుగాంచిన రోవాన్ అట్కిన్‌సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గతంలో చేసిన కామెడీ షోలు ఇప్పటికీ ఎంతగానో అలరిస్తున్నాయి. ఈయన కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఇక ఈయన నటించిన మ్యాన్ వర్సెస్ బీ అనే మూవీ ఈ నెల 24వ తేదీన రిలీజ్ అవుతోంది. దీన్ని నెట్ ఫ్లిక్స్ యాప్‌లో వీక్షించవచ్చు.
అలాగే ఈ మధ్యే విడుదలై సంచలనం సృష్టించిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ అనే మూవీ కూడా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాను జూన్ 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఇలా ఈ వారంలో పలు ముఖ్యమైన సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…