Recce Web Series : కరోనా పుణ్యమా అని ఓటీటీ యాప్ లతోపాటు ప్రేక్షకులు కూడా పండుగ చేసుకుంటున్నారు. కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ యాప్‌లలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. గతేడాది దసరా వరకు అనేక సినిమాలు ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. తరువాత పరిస్థితులు చక్కబడడంతో థియేటర్లలోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కానీ టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదు. మరీ భారీ బడ్జెట్ సినిమా అయితే తప్ప అగ్ర హీరోలు తీసిన సినిమాలను కూడా ప్రేక్షకులు చూడడం లేదు. కేవలం ఓటీటీల్లోనే చూద్దామని ఫిక్స్ అవుతున్నారు. అందుకనే ఓటీటీ యాప్‌లు ప్రేక్షకులకు కొత్త కొత్త కంటెంట్‌లను అందించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే అనేక ఓటీటీ యాప్‌లు భిన్నమైన సినిమాలు, సిరీస్‌లను నిర్మిస్తూ సందడి చేస్తున్నాయి. గతంలో ఇతర భాషలకు చెందిన ఓటీటీ యాప్‌లు మాత్రమే అద్భుతమైన సిరీస్‌లను తీసేవి. కానీ ఇప్పుడు మన మాతృభాషలోనూ అలాంటి సిరీస్‌లను తీస్తున్నారు. ఈ మధ్యే జీ5 సంస్థ గాలివాన అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు రెక్కీ అనే మరో సిరీస్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పలువురు ప్రముఖ నటీనటులు కీలకపాత్రలను పోషించారు. శివ బాలాజీ, అడుగళం నరేన్, శ్రీరామ్, జీవా, ధన్య బాలకృష్ణ, సమ్మెట గాంధీ వంటి నటీనటులు ఇందులో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ఎలాంటి హడావిడి లేకుండానే జీ5 యాప్‌లో విడుదలైంది. ఈ సిరీస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ బాగుందని చాలా మంది చెబుతున్నారు.
మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న రెక్కీ సిరీస్ కథ విషయానికి వస్తే.. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంగా ఈ సిరీస్ కథ సాగుతుంది. ఇందులో ఓ మున్సిపల్ చైర్మన్, తరువాత అతని కొడుకు హత్యకు గురవుతారు. అయితే ఈ హత్యలు చేసింది ఎవరు.. చివరకు ఏమవుతుంది ? వంటి విషయాలను తెలుసుకోవాలంటే.. ఈ సిరీస్‌ను చూడాల్సిందే. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కనుక ఈ జోనర్ అంటే ఇష్ట పడేవారు ఒకసారి ఈ సిరీస్‌ను చూడవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…