గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Liger : మైక్ టైస‌న్‌తో లైగ‌ర్ టీం.. మస్త్ చిల్ అవుతున్నారుగా..!

Liger : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గురువు…

Liger : మైక్ టైస‌న్‌తో లైగ‌ర్ టీం.. మస్త్ చిల్ అవుతున్నారుగా..!

Liger : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గురువు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. యూఎస్ షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ కాగా, ఆయ‌న‌తో క‌లిసి లైగ‌ర్ టీం ఫుల్ ఖుష్ అవుతోంది.

Liger team met with mike tyson

అమెరికా షెడ్యూల్‌లో విజయ్‌ దేవరకొండ, మైక్‌టైసన్‌పై ముఖ్య పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. ఆయనతో తీయించుకున్న ఓ ఫొటోను విజయ్‌ దేవరకొండ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Liger team met with mike tyson

‘టైసన్‌తో గడుపుతున్న ప్రతి నిమిషాన్ని గొప్ప జ్ఞాపకాలుగా భద్రపరచుకుంటున్నా. ఆయన ప్రేమకు నిర్వచనం. ఈ ఫొటో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. లైగర్‌ వర్సెస్‌ లెజెండ్‌..’ అంటూ ఫొటోపై వ్యాఖ్యానించారు.

బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ పతాకాలపై కరణ్‌జోహార్‌, పూరీ జగన్నాథ్‌, ఛార్మి, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Liger team met with mike tyson

ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ సినిమాకు అది బోనస్ అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి