Left Over Foods : తిన‌గా మిగిలిన ఆహారాల‌ను ఫ్రిజ్ లో పెడుతున్నారా ? అయితే ఇది త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Left Over Foods : సాధార‌ణంగా ఫ్రిజ్‌లు ఉన్న ఎవ‌రైనా స‌రే తిన‌గా మిగిలిపోయిన ఆహారాల‌ను ఫ్రిజ్ లో పెడుతుంటారు. వాటిని మ‌ళ్లీ ఇంకో పూట బ‌య‌ట‌కు తీసి వేడి చేసి తింటారు. అయితే అప్ప‌టికీ ఆ ఆహారం అయిపోక‌పోతే మ‌ళ్లీ దాన్ని ఫ్రిజ్ లో పెడ‌తారు. ఈ విధంగా చాలా మంది చేస్తుంటారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

తిన‌గా మిగిలిపోయిన ఆహారాల‌ను ఫ్రిజ్‌లో పెడుతున్న వారు క‌చ్చితంగా కింద తెలిపిన విష‌యాల‌ను తెలుసుకోవాలి. అవేమిటంటే..

ఆహార ప‌దార్థాల‌ను వండిన త‌రువాత 90 నిమిషాల్లో తినేయాలి. ఆలోగా వాటిని తిని పూర్తి చేస్తే ఓకే. లేదా ఏమైనా ఆహారాలు మిగిలితే వాటిని వండిన‌ప్ప‌టి నుంచి 90 నిమిషాల్లోగా ఫ్రిజ్ లో పెట్టేయాలి. అంటే.. ఇప్పుడు మీరు ఏదైనా వండి తింటే.. అందులో ఏమైనా మిగిలితే.. దాన్ని 90 నిమిషాల్లోగా ఫ్రిజ్‌లో పెట్టాల‌న్న‌మాట‌. దీంతో అందులో ఉండే పోష‌కాలు పోకుండా ఉంటాయి. బాక్టీరియా ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

ఇక ఒక‌సారి తిన‌గా మిగిలిన ఆహారాల‌ను ఫ్రిజ్ లో పెట్టి తీసి మ‌ళ్లీ వేడి చేసి తిన‌వ‌చ్చు. కానీ అంత వ‌ర‌కే వాటిని అయిపోగొట్టాలి. ఆ త‌రువాత కూడా వాటిని ఫ్రిజ్‌లో పెట్టి మ‌ళ్లీ తీసి వేడి చేసి తిన‌రాదు. వాటిల్లో అప్ప‌టికే చాలా వ‌ర‌కు పోష‌కాలు న‌శించి ఉంటాయి. పైగా బాక్టీరియా కూడా చేరుతుంటుంది. క‌నుక ఆహారాల‌ను ఒక‌సారి మాత్ర‌మే వేడి చేయాలి. మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేయ‌రాదు.

ఇక ఆహారాల‌ను వేడి చేయాల్సి వ‌స్తే సాధార‌ణ స్ట‌వ్ మీద వేడి చేయాలి. కానీ మైక్రోవేవ్‌ల‌ను ఉప‌యోగించ‌రాదు. వాటిల్లో తాజాగా వండాల్సి వ‌స్తేనే వాటిని ఉప‌యోగించాలి. ఇక పాలు, మాంసం, స‌ముద్ర‌పు ఆహారాల విష‌యంలోనూ ఇవే జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. దీంతో తినే ఆహారంలో పోష‌కాలు కోల్పోకుండా చూసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM