Lava Agni 5g : మొబైల్స్ తయారీదారు లావా దేశంలో తన మొదటి 5జి స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా అగ్ని 5జి పేరిట ఈ ఫోన్ విడుదలైంది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
లావా అగ్ని 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఇక డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌ను అమర్చారు. దీని వల్ల 5జి కి సపోర్ట్ లభిస్తుంది.
ఇక ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. 128 జీబీ స్టోరేజ్‌లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ లేదు. అందువల్ల రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డును వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా మరో 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌లు ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది.
5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లు ఈఫోన్‌లో ఉన్నాయి.
లావా అగ్ని 5జి ఫోన్ ధర రూ.19,999గా ఉంది. అయితే నవంబర్ 17వ తేదీ లోపు ఈఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి ఈ ఫోన్ ను రూ.17,999కే అందిస్తారు. ప్రీ బుకింగ్‌కు రూ.500 చెల్లించాలి. ఈ క్రమంలోనే ఈ ఫోన్‌ను అన్ని రిటెయిల్ ఔట్‌లెట్స్ తోపాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ నెల 18వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…