Lakshmi Devi Puja : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు లేకపోతే ఏ పనికాదు. డబ్బే సర్వస్వం అయింది. కనుకనే అందరూ డబ్బు సంపాదించాలని ఆరాట పడుతుంటారు. అయితే కొందరు మాత్రం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. ఇంకొందరు డబ్బు సంపాదించినా చేతిలో నిలవడం లేదని విచారం వ్యక్తం చేస్తుంటారు. వృథాగా ఖర్చయిపోతుందని అంటుంటారు. అయితే అలాంటి వారు లక్ష్మీ దేవిని పూజించాలి. దీంతో దోషాలు పోతాయి. ఆమె అనుగ్రహం కలుగుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. వృథా ఖర్చు కాదు. లక్ష్మీ దేవిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి చెట్టు దగ్గర మహిళలు దీపం వెలిగించి పూజలు చేయాలి. తులసి సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తారు. కనుక తులసి మొక్క దగ్గర దీపం పెడుతూ ఉంటే తప్పక ఫలితం ఉంటుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే తెల్లని వస్త్రాన్ని నేలపై పరిచి దానిపై ధాన్యం పోయాలి. అందులో అమ్మవారిని ప్రతిష్టించాలి. బాగా అలంకరించాలి. తరువాత చామంతి పూలతో పూజలు చేయాలి. దీంతో అమ్మవారు సంతృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేలా చేస్తుంది. అప్పుల బాధలు ఉండవు.
లక్ష్మీదేవిని గులాబీ, తామర పువ్వులు, మల్లె పువ్వులు, సన్న జాజులతో పూజించాలి. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు. సంపదలు సిద్ధిస్తాయి. అలాగే అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. అష్టోత్తరం చదవాలి. తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అమ్మవారిని పూజిస్తే ఆమె ఆశీస్సులు మనకు లభిస్తాయి. దీని వల్ల డబ్బు బాగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే గట్టెక్కవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…