Krishna Kaushik : తెలుగులో చాలామంది బుల్లితెర నటులకు మంచి క్రేజ్ ఉంది. నటుడిగా, యాంకర్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న వారిలో శ్రీకృష్ణ కౌశిక్ కూడా ఒకరు. ఆయన తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఇటీవల పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ లు వీఐపీ జైల్ లో ఉన్నప్పుడు తాను జనరల్ బరాక్ లో ఉన్నానని అన్నారు. అక్కడ దాదాపుగా 80 మంది ఖైదీలున్నారని అన్నారు. ఒక్కొక్కరికి ఒక ప్లేట్, దుప్పటి ఇచ్చారని పక్కనే పెట్టుకుంటే ఎవరో తీసేసుకున్నారని అన్నారు.
ఆ విషయాన్ని అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ కి చెప్తే ఇక్కడ దొంగలుంటారని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారట. అక్కడ బాత్ రూమ్ కి డోర్స్ ఉండవు. అయినా అలాగే వెళ్ళాలని అన్నారట. అలాగే జైలులో కౌంట్ చేసుకుంటూ వస్తూ తన దగ్గరకు వచ్చేసరికి ఏంటి సార్ అని అన్నారని తెలిపారు. మీరు ఫైట్ చేస్తున్న కారణం మంచిది సర్, మీరు చేసేది మీకు కచ్చితంగా మంచి చేస్తుందని జైలర్ అన్నట్లు తెలిపారు. ఆయన అలా అనడంతో తనకు మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు. ఇక అక్కడ రిజిస్టర్ లో పేరు రాసుకున్నాక, మొలతాడుతో పాటు ఇంకేమైనా తాళ్ళు ఉంటే వాటిని కట్ చేశారని అన్నారు.
అలాగే ఖైదీలను నగ్నంగా నిలుచోవాలనేసరికి షాక్ అయ్యారట. ఎందుకంటే ఎక్కడైనా గాయాలు అయ్యాయేమోనని టార్చ్ లైట్ వేసుకుని మరీ చూస్తారని కౌశిక్ అన్నారు. ఒకవేళ ఏమైనా అయితే కేస్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అని తెలిపారు. మమ్మల్ని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళాక.. కానిస్టేబుల్.. కౌశిక్ ని చూసి సర్ మీరా బట్టలు వేసుకోండి.. నేను చెబుతాలే.. అని అన్నాడని తెలిపారు. ఆ క్షణంలో కళాకారుడికి ఇంత మర్యాద ఉంటుందా.. అని ఎంతో ఆనందం వేసిందని.. కౌశిక్ తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…