Karthikeya 2 Review : కార్తికేయ 2తో నిఖిల్‌ మళ్లీ హిట్‌ కొట్టినట్లే.. మూవీ సూపర్బ్‌.. రివ్యూ..!

Karthikeya 2 Review : వైవిధ్యభరితమైన చిత్రాలలో నటించడంలో యంగ్‌ హీరో నిఖిల్‌కు మంచి పేరే ఉంది. ఈయన ఏ మూవీ చేసినా అందులో అద్భుతమైన కథ ఉంటుంది. అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా మొత్తం కథ మీదే ఫోకస్‌ పెట్టి సినిమాలను చేస్తారు. కనుకనే గతంలో వచ్చిన కార్తికేయ మొదటి సినిమాతోపాటు ఎక్కడికి పోతావు చిన్నవాడా.. తదితర చిత్రాలు హిట్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు మళ్లీ కార్తికేయ 2తో నిఖిల్‌ మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ శనివారం థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది ? కథ ఏమిటి ? ప్రేక్షకులను ఏ మేర అలరిస్తోంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ..

కార్తికేయ మొదటి సినిమాకు కార్తికేయ 2కు అసలు సంబంధం లేదు. సీక్వెల్‌ కాదు. ఈ మూవీలో పూర్తిగా కొత్త కథను చూపించారు. కార్తీక్‌ ఒక ప్రొఫెసర్‌. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలి పాదానికి ధరించిన ఒక పట్టీ చుట్టూ కథ తిరుగుతుంది. అది ఎక్కడ ఉంటుంది ? దానికి కార్తీక్‌కు సంబంధం ఏమిటి ? దాని కోసం ఎవరు అన్వేషిస్తుంటారు ? చివరకు ఏమవుతుంది ? కార్తీక్‌ ఏం చేస్తాడు ? వంటి విషయాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

Karthikeya 2 Review

విశ్లేషణ..

సాధారణంగా సినిమా అంటే అన్ని కమర్షియల్‌ హంగులు ఉంటాయి. దీంతో కథను కాస్త సైడ్‌ ట్రాక్‌ పట్టిస్తారు. కానీ కార్తికేయ 2లో అలా జరగలేదు. దర్శకుడు చందూ మొండేటి పూర్తిగా కథపైనే ఫోకస్‌ పెట్టారు. కనుక మొదటి నుంచి చివరి వరకు కథపైనే ఫోకస్‌ ఉంటుంది. ప్రేక్షకుల దృష్టి మళ్లదు. కార్తికేయ మొదటి పార్ట్‌కు దీంతో సంబంధం లేదు. అది పూర్తిగా హార్రర్‌, మిస్టరీ కథాంశాలతో వచ్చింది. ఇప్పుడు వచ్చిన మూవీని కూడా ఇదే జోనర్‌లో తెరకెక్కించారు. అందువల్ల ప్రేక్షకులు ప్రతి సీన్‌లోనూ థ్రిల్‌కు గురవుతుంటారు. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. దీన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అందువల్ల ఈ మూవీ సీన్‌ టు సీన్‌ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

కార్తికేయ 2లో నిఖిల్‌ అదరగొట్టాడు. ఇలాంటి రోల్స్‌ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కార్తికేయ మొదటి పార్ట్‌లోనూ సీరియస్‌నెస్‌తో కథను ముందుకు తీసుకెళ్తారు. అందులో నిఖిల్‌ అద్భుతంగా సక్సెస్‌ అయ్యాడు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. అలాగే అనుపమ పరమేశ్వరన్‌ రోల్‌ కూడా ఈ మూవీలో ముఖ్యమైనదే. కమెడియన్ శ్రీనివాస రెడ్డి సహాయక పాత్రలో న్యాయం చేశారు. ఈ మూవీ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌కు తెలుగులో మొదటిది. అయినప్పటికీ తన పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఇక వైవా హర్ష, ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.

ఈ సినిమాకు కాలభైరవ అందించిన సంగీతం బాగుంటుంది. పలు శ్లోకాలను మూవీలో చేర్చారు. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. కార్తీక్‌ ఘట్టమనేని అద్భుతంగా సీన్లను చూపించారు. ఆయన ఎడిటింగ్‌ బాధ్యతలను కూడా నెరవేర్చారు. ఇక సినిమాలో కొన్ని చోట్ల లాజిక్‌ ఉండదు. కొన్ని సీన్లను మరీ అసంపూర్తిగా తీశారని అనిపిస్తుంది. ఇవి రెండే దీనికి మైనస్‌ పాయింట్లు. అలాగే కొత్త కథ కావడం, నిఖిల్‌ యాక్టింగ్‌, డైలాగ్స్‌, లొకేషన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం వంటివి సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌. కనుక ఓవరాల్‌గా చూస్తే కార్తికేయ 2 ఫ్రెష్‌ మూవీ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్‌లో చూడదగ్గ సినిమా ఏదైనా ఉందంటే.. అది కార్తికేయ 2 అని చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ మూవీని తప్పక చూడాలి. కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM