గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Karthika Deepam : ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని దీప.. ఆందోళనలో కార్తీక్..!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత తన కొడుకు బారసాలకి రావాలని కార్తీక్ కుటుంబాన్ని ఆహ్వానించగా అందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది…

Karthika Deepam : ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని దీప.. ఆందోళనలో కార్తీక్..!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత తన కొడుకు బారసాలకి రావాలని కార్తీక్ కుటుంబాన్ని ఆహ్వానించగా అందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ దీప మాట ఇస్తుంది. దీప మాటలకు అందరూ షాక్ అవుతారు. ఇక అక్కడి నుంచి వెళ్లిన మోనిత కంగారు పడుతుంది. ఇక గుడికి వెళ్ళాలి అని బయలుదేరిన దీప.. అత్తయ్య మీరు గుడికి ఎలాగో రారు, నేను, పిల్లలు వెళ్లి వస్తాం.. అంటూ బయలు దేరుతారు.

Karthika Deepam  today episode deepa did not return home

దీప ప్రవర్తన చూసి కార్తీక్, సౌందర్య, ఆనందరావు ఆందోళన చెందుతారు. దీపకి నిజం తెలిసినా ఇలా నవ్వుతూ మాట్లాడుతుంది, అసలు ఏం నిర్ణయం తీసుకుంది.. అంటూ సౌందర్య బాధపడుతుంది. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలనుకున్నా ఎంతో భయంగా ఉందిరా.. అంటూ మాట్లాడుతుంది. ఇక దీపకు నిజం చెప్పేస్తాను మమ్మీ, అప్పుడైనా కొంచెం టెన్షన్ తగ్గుతుంది.. అని అనుకుంటాడు.

Karthika Deepam : మోనిత కంగారు పడుతుంది

మోనిత కారులో ఇంటికి వెళ్తూ..  దీప అన్న మాటలను గుర్తు చేసుకుని భయపడుతుంది. అసలు విషయం తెలిసి అస్తమిస్తున్న సూర్యుడి వైపు పయనిస్తుంది అనుకుంటే దీప ఎలా మాట్లాడుతుంది.. అంటూ కంగారు పడుతుంది. అయినా నా వైపు ఆనందరావు గారు ఉన్నారు, నేను విజయంలోనే ఉన్నాను.. అంటూ తనకు తాను సర్ది చెప్పుకుంటుంది.

ఇక గుడికి వెళ్ళిన పిల్లలతో దీప ఎంతోసంతోషంగా గడుపుతూ గుడి నుంచి పిల్లలను రెస్టారెంట్ కు తీసుకెళ్తుంది, మీకేం కావాలో అవన్నీ తినండి, మీకు అడ్డు చెప్పనని అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇక కుటుంబ సభ్యులు ఊహించిన విధంగానే గుడి నుంచి కేవలం పిల్లలు మాత్రమే ఇంటికి తిరిగి వస్తారు. అమ్మ ఏది.. అని అడగడంతో అమ్మ వెళ్ళిపోయింది, అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్ళింది, రేపు మీరు అందరూ ఎక్కడికో వెళ్తారు అంట కదా.. అక్కడ నుంచి వస్తానని చెప్పింది.. అనడంతో వారందరూ షాక్ అయ్యి వెంటనే దీపకి ఫోన్ చేస్తాడు కార్తీక్. అప్పటికే దీప ఫోన్ స్విచాఫ్ వస్తుంది. మరి దీప ఇవ్వబోయే షాక్ ఏంటో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి