Karthika Deepam : ఒక్కసారిగా పడిపోయిన కార్తీకదీపం రేటింగ్స్.. కారణం అదేనా ?

November 13, 2021 9:18 PM

Karthika Deepam : బుల్లితెరలో స్టార్ మా ఛానల్ లో ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా ఏ కార్యక్రమం కూడా కార్తీకదీపం సీరియల్ రేటింగ్ ను క్రాస్ చేయలేకపోయింది. అంతగా ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశేషమైన ప్రేక్షకాభిమానులు ఉన్నారు. ఈ సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సీరియల్ ను ఎంతో ఆసక్తికరంగా చూస్తారు.

Karthika Deepam ratings fall suddenly this may be the reason

ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల వరకు ఈ సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా ఈ సీరియల్ రేటింగ్స్‌ ఏకంగా 18-21 మధ్య టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చేవి. ఇలా ఎంతో మంచి రేటింగ్స్ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ సీరియల్ కు ఉన్న ఫలంగా రేటింగ్స్ పడిపోయాయి. ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ఈ సీరియల్ ను చూసిన అభిమానులు ప్రస్తుతం ఈ సీరియల్ ను చూడటానికి ఇష్టపడటం లేదు.

ఇలా ఉన్నఫలంగా సీరియల్ రేటింగ్స్ పడిపోవడానికి గల కారణం ఈ సీరియల్ ను ఎక్కువగా సాగదీయడం వల్ల ప్రేక్షకులకు సైతం ఈ సీరియల్ పై ఎంతో విసుగుపుడుతోంది. ఈ క్రమంలోనే ఎంతో ఆదరించే అభిమానులు సైతం ఈ సీరియల్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సీరియల్ 14-15 రేటింగ్స్ కి పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే పూర్తిగా ఈ సీరియల్ ను చూసే అభిమానులు ఉండరు అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment