గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Karthika Deepam : మరోసారి కుటుంబ సభ్యులకు షాకివ్వనున్న వంటలక్క.. బారసాలకి అందరమూ వస్తామని హామీ..!

Karthika Deepam : బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో.. నిజం తెలిసిన దీప సంతోషంగా ఉంటూ ఎంతో బాధపడుతుంది. ఇక దీపావళి పండుగను కుటుంబ…

Karthika Deepam : మరోసారి కుటుంబ సభ్యులకు షాకివ్వనున్న వంటలక్క.. బారసాలకి అందరమూ వస్తామని హామీ..!

Karthika Deepam : బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో.. నిజం తెలిసిన దీప సంతోషంగా ఉంటూ ఎంతో బాధపడుతుంది. ఇక దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సమయంలో.. సౌందర్యకి మోనిత ఫోన్ చేసి.. బాబుకి బాగాలేదు, కార్తీక్ ని పంపించమని అడుగుతుంది. ఆ సమయంలో కార్తీక్.. దీప జాగ్రత్త.. చీర అంటుకుంటుందనే.. మాటలు విన్న మోనిత కోపంతో రగిలిపోతూ ప్రియమణి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

Karthika Deepam deepa shocks family members says ok to monitha

ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా దీపావళి జరుపుకుంటుండగా సౌందర్య, కార్తీక్, ఆనందరావు.. దీప చివరి నిర్ణయం అంటూ మాట్లాడుతుంది.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. అంటూ బాధపడతారు. ఇక టపాకాయలు కాల్చి పిల్లలతో సరదాగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిన దీపతో.. నీ జోకులు ఆపమ్మా.. నవ్వలేకపోతున్నాను అంటూ పిల్లలు సరదాగా మాట్లాడుతారు.

నాన్న.. ఈరోజు అమ్మ పుట్టిన రోజు.. తనకు గిఫ్ట్ ఇచ్చావా అని పిల్లలు అడగడంతో.. వెంటనే దీప.. మీ నాన్న ఎప్పుడో పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు.. అని చెబుతుంది. ఆ మాటకు సౌందర్య, కార్తీక్ బాధపడతారు.

వీళ్ళు అందరూ ఇలా మాట్లాడుతుండగా అదే సమయంలో కార్తీక్ ఇంటికి మోనిత రావడంతో అందరూ షాక్ అవుతారు. మోనితను చూసిన కార్తీక్ తనని బయటకు వెళ్ళమని అరవగా.. దీప మాట్లాడుతూ.. ఇంటికి వచ్చిన వారితో ఇలాగేనా మాట్లాడటం డాక్టర్ బాబు.. అంటుంది.

దీప మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మోనిత తన కొడుకు బారసాలకు రావాలని ఆహ్వానించడంతో అందుకు కార్తీక్ కుటుంబం ఒప్పుకోదు. అయితే దీప మాట్లాడుతూ నువ్వు వెళ్లి బారసాల ఏర్పాట్లు చేసుకో.. వీళ్లందరినీ తీసుకువచ్చే బాధ్యత నాది.. అంటూ హామీ ఇస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

అసలు సిసలైన ట్విస్ట్ రేపిస్తా అంటూ మోనితకి దీప చెప్పడంతో ఆమె కంగారు పడుతుంది. అయితే రేపటి ఎపిసోడ్ లో దీప తన కుటుంబ సభ్యులకు ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో.. తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి