గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Karthika Deepam 27 Nov Today Episode : బస్తీ ప్రజల ముందు కార్తీక్ పరువు తియ్యడానికి సిద్దమైన మోనిత..!

Karthika Deepam 27 Nov Today Episode : సౌందర్య చాలా సంతోషంగా కనిపిస్తుంది. మరోవైపు దీప కూడా కార్తీక్ తో సంతోషంగా గడుపుతుంది. తమ తల్లిదండ్రుల ఆనందాన్ని చూసి పిల్లలు మురిసిపోతారు. కార్తీక్ ఇంటి బయట మోనిత…

Karthika Deepam 27 Nov Today Episode : బస్తీ ప్రజల ముందు కార్తీక్ పరువు తియ్యడానికి సిద్దమైన మోనిత..!

Karthika Deepam 27 Nov Today Episode : సౌందర్య చాలా సంతోషంగా కనిపిస్తుంది. మరోవైపు దీప కూడా కార్తీక్ తో సంతోషంగా గడుపుతుంది. తమ తల్లిదండ్రుల ఆనందాన్ని చూసి పిల్లలు మురిసిపోతారు. కార్తీక్ ఇంటి బయట మోనిత తన బాబు, ప్రియమణితో కలిసి ఎదురుచూస్తుంది. అప్పుడే సౌందర్య వాళ్ళు వాకింగ్ అని బయటకి వెళ్లేటప్పుడు వాళ్ళను చూసి దాక్కుంటుంది. ప్రియమణి మోనితను ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో మోనిత కోపంతో రగిలిపోతుంది.

karthika deepam 27 november 2021 full episode
karthika deepam 27 november 2021 full episode

ఇక ఇంట్లో కార్తీక్, ఆదిత్య కలిసి టిఫిన్ చేస్తుంటారు. దీప వాళ్లతో సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే మురళి కృష్ణ వచ్చి దీపను పక్కకు పిలిచి బయట మోనిత ఎదురు చూస్తుందని అంటాడు. దీప వెళ్లి కార్తీక్ తో మోనిత గురించి చెబుతుంది. వెంటనే ఆదిత్య కోపంతో రగిలిపోతాడు. తన పని ఏంటో చూస్తానని అనడంతో కార్తీక్ కంట్రోల్ చేస్తాడు. మరో వైపు బస్తీలో వారణాసి క్యాంపు ఏర్పాట్లు హడావుడి చేస్తూ ఉంటాడు. దీప గురించి గొప్పగా మాట్లాడతాడు.

Karthika Deepam 27 Nov Today Episode : బస్తీలో క్యాంప్ కు వెళ్లి అందరికీ చెకప్..

కార్తీక్ వాళ్ళ కోసం భోజనం ఏర్పాట్లు చేస్తారు. ఇంట్లో నుండి దీప, కార్తీక్ క్యాంపుకు బయలుదేరుతారు. బయట కారు ఆపి మోనిత కోసం చూస్తారు. మోనిత లేదని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వెంటనే మోనిత వాళ్లని ఫాలో అవుతుంది. కార్తీక్ బస్తీలో క్యాంప్ కు వెళ్లి అందరికీ చెకప్ చేస్తాడు. అక్కడ ఒకామె తన భర్త తన పిల్లలు పట్టించుకోవడంలేదని అనడంతో అసలు వాడు తండ్రేనా అని కార్తీక్ అంటాడు. వెంటనే మోనిత ఎంట్రీ ఇచ్చి ఆ ప్రశ్నలు నేను వేయాలి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది.

తరువాయి భాగంలో మోనిత బస్తీ వాళ్ళ ముందు కార్తీక్ పరువు తీయడానికి ప్రయత్నించడంతో దీప తనకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక బస్తీ వాళ్లు కూడా కోపంతో మోనిత దగ్గరికి వెళ్లి తనపై చీపుర్లు ఎత్తి బెదిరిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి