Karthika Deepam : బారసాలలో మోనిత బండారం అంతా బయట పడింది.. శాంపిల్స్‌ దొంగిలించి బిడ్డను కన్న మోనిత..

November 24, 2021 10:20 AM

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ బాగా ఆసక్తి గా మారుతోంది. మోనిత ఇంట్లో బాబు బారసాలకు అతిథులతో సహా దీప కూడా వచ్చింది. మోనితను పలకరించి సంతోషంగా మాట్లాడుతుంది. మోనిత కూడా దీప ప్రవర్తనతో తనకు ఏదో అద్భుతం జరుగుతుంది అన్నట్లుగా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంట్లో బారసాల ఏర్పాట్ల గురించి దీప అడగటంతో వంటలు మిస్ అయ్యాయని చెబుతుంది. దీప మొత్తానికి మోనిత ఇంట్లో గరిట పట్టుకుంది.

Karthika Deepam 24 november 2021 full episode

మరోవైపు కార్తీక్, సౌందర్య, ఆనందరావు ఇష్టం లేకుండా ఆ బారసాలకు దీప కోసం వస్తారు. అక్కడ కార్తీక్.. దీపను చూసి షాక్ అవుతాడు. సౌందర్య వాళ్ళను చూసిన మోనిత సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక బాబును ఉయ్యాలలో వెయ్యమని దీప చెప్పటంతో ఆంటీ వేస్తే బాగుండని అంటుంది మోనిత.

ఆ కోరిక కూడా తీరుతుందని దీప అనడంతో వెళ్లి తన కొడుకును ఉయ్యాలలో వేస్తుంది. ఆనంద రావు అని పేరు పెడుతుంది. తను పైకి లేచేటప్పుడు తన మంగళసూత్రం బయట పడుతుంది. అది చూసేసరికి దీప కోపంతో రగిలిపోతుంది.

సౌందర్య వాళ్ళు, కార్తీక్ చూసి షాక్ అవుతారు. దీప కాసేపు సరదాగా మాట్లాడుతూ అందరికీ నీ వాళ్ళను పరిచయం చేయమని అంటుంది. దీప అన్నట్లుగానే మోనిత అందరినీ పరిచయం చేస్తుంది. ఇక నన్ను పరిచయం చేయవా ఏంటి అనేసరికి మోనిత తను మా అక్క అంటూ పరిచయం చేస్తుంది.

ఇక్కడి నుంచి వంటలక్క అసలు రూపాన్ని బయట పెడుతుంది. ఏ వరుస ప్రకారం అక్క అవుతాను.. అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఈ క్రమంలోనే దీప నా భార్య అంటాడు కార్తీక్. నా జీవితం, తనే నా ప్రపంచం అంటాడు. ఈవిడ మీ భార్య అయితే.. మరి ఆవిడ ఎవరు అని పండితుడు ప్రశ్నిస్తాడు. దీంతో దీప.. ఈవిడ ఎవరో.. ఈవిడ కథాకమామీషు.. అన్నీ నేను చెబుతాను.. అంటుంది. చెప్పడానికి మాకు.. వినడానికి మీకు కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది.. అని చెప్పి మొత్తం స్టోరీ చెబుతుంది దీప.

మోనిత మోసాన్ని దీప బయట పెడుతుంది. దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్ కొట్టేయడంతో సహా మొత్తం విషయం అంతా చెప్పేస్తుంది దీప. అయినప్పటికీ మోనిత.. తాను కార్తీక్ వల్లే తల్లినయ్యానని చెబుతుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన దీప.. నోర్ముయ్‌.. అంటూ మోనిత చెంప పగలగొట్టబోతుంది. వెంటనే ల్యాబ్ రిపోర్టులను బయటపెడుతుంది. దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాత ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment