Kajal Aggarwal : సరికొత్త రికార్డ్ ని బ్రేక్ చేసిన కాజల్ అగర్వాల్

October 25, 2021 10:26 AM

Kajal Aggarwal : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న టాప్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో తన అందం, అభినయంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది. కాజల్ కు, తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూతో పెళ్ళి జరిగింది. అయినా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఏమాత్రం ఢోకా లేకుండా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోంది. నిజానికి కాజల్ అందం పెళ్ళి కాకముందు కంటే పెళ్ళి జరిగాకే పెరిగిందంటున్నారు అభిమానులు. తనలోని గ్లామర్ యాంగిల్ ను ఎక్కువగా సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తుంటుంది. రీసెంట్ గా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి.

Kajal Aggarwal created new record her followers increased

అలాగే కాజల్ కూడా ప్రస్తుతం ఎలాంటి సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. ఇంతకుముందు కమిట్ అయిన సినిమాల్ని కూడా పక్కన పెట్టేసింది. రీసెంట్ గా నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వస్తున్న ‘ది ఘోస్ట్’ మూవీలో మొదటగా కాజల్ అగర్వాల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ కనుక ఈ సినిమాను వదులుకుంటున్నట్లు సమాచారం. అందుకే నాగార్జునకు జోడిగా అమలాపాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఫిల్మ్ టీమ్. అయితే ఈ వార్తలపై కాజల్ అగర్వాల్ స్పందించకపోవడం గమనార్హం.

ఇక ఎప్పటికప్పుడు తన యాక్టివిటీస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే కాజల్ అగర్వాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఎక్కువగా పాపులర్ అయిన సౌత్ స్టార్స్ లో కాజల్ కూడా ఒకరు అనే విషయం ఖరారైంది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టా ఫాలోవర్స్ కౌంట్ 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతానికి కాజల్ హీరోయిన్ గా కంప్లీట్ చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా వచ్చే ఏడాది ఫ్రిబవరి 4 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment