JioPhone Next : టెలికాం కంపెనీ రిలయన్స్, సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ కలిసి సంయుక్తంగా రూపొందిస్తున్న జియో ఫోన్ నెక్ట్స్‌కు చెందిన స్పెసిఫికేషన్స్ నెట్‌లో లీక్ అయ్యాయి. అభిషేక్ యాదవ్ అనే యూజర్ ఈ ఫోన్‌కు చెందిన స్పెసిఫికేషన్స్ వివరాలను ట్వీట్ చేశారు. ఈ వివరాలు గూగుల్ ప్లే కన్సోల్‌లో నమోదు కాబడ్డాయి.
జియో ఫోన్ నెక్ట్స్‌లో హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ డిస్‌ప్లే సైజ్ గురించి చెప్పలేదు. కానీ 4.7 ఇంచులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1440 పిక్సల్స్ గా ఉంది. అలాగే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్ వంటి ఇతర ఫీచర్లు దీంట్లో ఉన్నట్లు లీకైన స్పెసిఫికేషన్స్ ను చూస్తే అర్థమవుతోంది.
కాగా ఈ ఫోన్ ను రిలయన్స్ ఏజీఎంలో ముకేష్ అంబానీ ప్రకటించారు. వినాయక చవితికే ఈ ఫోన్‌ను లాంచ్ చేయాల్సి ఉంది. కానీ చిప్‌ల కొరత కారణంగా ఈ ఫోన్ విడుదలను దీపావళికి వాయిదా వేశారు. అయితే దీపావళి రోజు ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తారేమోనని వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధరను రూ.3,499 గా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…