Jeevitha Rajasekhar : చిరంజీవి వ‌ల్లే అప్ప‌ట్లో అలా చేయాల్సి వ‌చ్చింది.. జీవిత రాజ‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Jeevitha Rajasekhar : న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్ ఈమ‌ధ్య తెగ వార్త‌ల్లో నిలిచారు. త‌న‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండా ఎగ్గొట్టింద‌ని.. అడిగితే బెదిరిస్తుంద‌ని.. ఆరోపిస్తూ ఓ నిర్మాత ఆమెకు నోటీసులు పంపించారు. అయితే ఇదంతా కుట్ర అని.. త‌మ కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకు ఎవ‌రో కావాల‌నే ఇలా చేస్తున్నార‌ని జీవిత ఆరోప‌ణ‌లు చేశారు. ఇక త‌మ కుమార్తెల గురించి యూట్యూబ్ చాన‌ళ్ల‌లో త‌ప్పుడు వార్త‌లు రాస్తూ.. థంబ్ నెయిల్స్ పెడుతున్నార‌ని.. అలా చేయ‌వ‌ద్ద‌ని.. ఆమె క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. దీంతో ఆమె వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఇక రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న శేఖ‌ర్ చిత్రానికి గాను జీవిత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ క్ర‌మంలోనే సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఆమె మీడియాతో ముచ్చ‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

తాను లేదా త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ ఏ రాజ‌కీయ పార్టీలో చేర‌లేద‌ని.. అయితే తాను బీజేపీలో అప్ప‌ట్లో చేరినా.. త‌న‌కు సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌నుల కార‌ణంగా.. తాను బిజీగా ఉండ‌డం చేత‌.. పార్టీకి స‌రిగ్గా ప‌నిచేయ‌లేద‌ని.. ఆ త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని తెలిపారు. ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో కాంగ్రెస్‌లో చేరామ‌ని.. కానీ ఆ పార్టీలో చిరంజీవి త‌న ప్రజా రాజ్యం పార్టీని విలీనం చేశాక‌.. ఆయ‌న‌తో అప్ప‌ట్లో ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగా కాంగ్రెస్ లో కూడా కొన‌సాగ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చేశామ‌ని వివ‌రించారు. అయితే జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆయ‌నను ప‌ర్స‌న‌ల్‌గా క‌లుద్దామ‌ని చాలా సార్లు అనుకున్నామ‌ని.. కానీ త‌న‌కు, త‌న భ‌ర్త‌కు వీలు కాలేద‌ని అన్నారు.

Jeevitha Rajasekhar

ఇక త‌న కుటుంబంపై త‌న డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని అడ‌గ్గా.. అందుకు ఆమె బ‌దులిస్తూ.. త‌న భ‌ర్త‌కు తెలుగు అంత‌గా రాద‌ని.. స‌రిగ్గా మాట్లాడ‌లేర‌ని.. క‌నుక ఆయ‌నకు బ‌దులుగా తానే మాట్లాడతాన‌ని.. అయితే దీని వ‌ల్ల త‌ప్పుడు సంకేతం వెళ్లింద‌ని.. తాను భ‌ర్త‌ను డామినేట్ చేస్తాన‌ని అనుకుంటున్నార‌ని.. జీవిత తెలియ‌జేశారు. కాగా త‌న‌కు చిరంజీవి లేదా మోహ‌న్‌బాబుతో ఎలాంటి విభేదాలు లేవ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

మా ఎన్నిక‌ల్లో త‌న‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌నే ఆలోచ‌న లేద‌ని.. అయితే ప్ర‌కాష్ రాజ్ ఇండ‌స్ట్రీకి ఏదో చేస్తార‌న్న ఉద్దేశంతో ఆయ‌న ప్యానెల్ త‌ర‌ఫున పోటీ చేశాన‌ని తెలిపారు. ఆయ‌న మ‌ళ్లీ మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని చెప్పారు. ఇక న‌రేష్ చేస్తున్న పనులు న‌చ్చ‌కే తాను మ‌ళ్లీ పోటీ చేయాల‌ని భావించాన‌ని అన్నారు. అలాగే అనేక సార్లు తాను ప్ర‌కాష్ రాజ్‌తో మాట్లాడాన‌ని.. ఆయన తోటి న‌టీన‌టుల‌కు ఏదో ఒక‌టి చేస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని అన్నారు.

ఇక రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే.. క‌థ స‌రిగ్గా ఉండాలే కానీ రాజ‌శేఖ‌ర్ ఎలాంటి సినిమా అయినా చేస్తారని స్ప‌ష్టం చేశారు. శేఖ‌ర్ సినిమాకు తాము చాలా క‌ష్ట‌ప‌డ్డామ‌ని.. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌, డైలాగ్స్, రీ రికార్డింగ్ ప‌నుల‌ను త‌మ కుమార్తెలు కూడా చూసుకున్నార‌ని స్ప‌ష్టం చేశారు. శేఖ‌ర్ సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని.. ఎమోష‌న‌ల్‌గా సాగుతుంద‌ని తెలిపారు. ఇక ఈ మూవీ మే 20వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM