Andrew Symonds : విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మ‌న్ ఆండ్రూ సైమండ్స్ హ‌ఠాన్మ‌ర‌ణం.. ఐసీసీ ఘ‌న నివాళి..!

Andrew Symonds : ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత విధ్వంస‌క‌ర‌మైన బ్యాట్స్‌మెన్ ల‌లో ఆండ్రూ సైమండ్స్ (46) ఒక‌రు. అప్ప‌ట్లో రికీ పాంటింగ్ సార‌థ్యంలోని ఆస్ట్రేలియా జ‌ట్టు ఎంతో దుర్బేధ్యంగా ఉండేది. ఆ జ‌ట్టులో సైమండ్స్ ఒక‌రు. ఈయ‌న బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించారు. అప్ప‌ట్లో ఐపీఎల్ ప్రారంభంలో ఉన్న డెక్క‌న్ చార్జ‌ర్స్ జ‌ట్టుకు సైమండ్స్ ఆడాడు. ఆ త‌రువాత కొంత కాలానికి అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్ర‌స్తుతం కామెంటేట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సైమండ్స్ శ‌నివారం హ‌ఠాన్మ‌ర‌ణం చెందాడు. శ‌నివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్ విల్లె స‌మీపంలో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో సైమండ్స్ దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. దీంతో క్రికెట్ లోకం ఒక్క‌సారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

సైమండ్స్ మృతితో యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత క్రికెట‌ర్ల‌తోపాటు ప‌లువురు మాజీలు కూడా ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు. అయితే ఇటీవ‌లే ఆస్ట్రేలియాకు చెందిన మాజీ స్పిన్న‌ర్ షేన్ వార్న్ గుండె పోటుతో చ‌నిపోగా.. ఇప్పుడు సైమండ్స్ చ‌నిపోవ‌డం ఆ జ‌ట్టును ఒక్క‌సారిగా షాక్ కు గురి చేసింది. సైమండ్స్‌తో త‌మ‌కు ఉన్న అనుబంధాన్ని తోటి మాజీ జ‌ట్టు స‌భ్యులు గుర్తు చేసుకుని విచారానికి గుర‌వుతున్నారు. ఇక సైమండ్స్‌కు ఐసీసీ సైతం నివాళులు అర్పించింది. అప్ప‌ట్లో 2003 ప్ర‌పంచ‌క‌ప్‌లో సైమండ్స్ బ్యాటింగ్ కు చెందిన వీడియోను ఐసీసీ షేర్ చేసి నివాళులు అర్పించింది.

Andrew Symonds

2003 ప్ర‌పంచ క‌ప్‌లో ఆస్ట్రేలియాకు రికీ పాంటింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ టోర్నీ సౌతాఫ్రికాలో జ‌రిగింది. అందులో భాగంగా పాకిస్థాన్‌తో జ‌రిగిన త‌మ తొలి మ్యాచ్‌లోనే సైమండ్స్ విధ్వంస‌క‌రంగా ఆడాడు. 125 బంతుల్లో 2 సిక్స‌ర్లు, 18 ఫోర్ల‌తో 143 ప‌రుగులు చేసి సైమండ్స్ నాటౌట్ గా నిలిచాడు.దీంతో ఆస్ట్రేలియా 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 310 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన పాక్ 44.3 ఓవ‌ర్ల‌ల‌నే ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 82 ప‌రుగుల తేడాతో పాక్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే ఈ మ్యాచ్ తాలూకు వీడియోను ఐసీసీ షేర్ చేసి సైమండ్స్ కు నివాళులు అర్పించింది.

ఇక సైమండ్స్ మంకీ గేట్ వివాదంతోనూ పాపుల‌ర్ అయ్యాడు. అప్ప‌ట్లో ఆస్ట్రేలియాలో భార‌త జట్టు ప‌ర్య‌టించ‌గా.. భార‌త మాజీ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ను సైమండ్స్ మంకీగా దూషించాడు. దీంతో యావ‌త్ ప్ర‌పంచం భ‌జ్జీకి అండ‌గా నిలిచింది. అయితే ఆ త‌రువాత కొంత కాలానికి అలా పిలిచినందుకు సైమండ్స్ సారీ కూడా చెప్పాడు. కాగా సైమండ్స్ హఠాన్మ‌ర‌ణం తోటి ప్లేయ‌ర్లందరినీ ఎంతో షాక్‌కు గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM