Janhvi Kapoor : తన కెరీర్ ప్రారంభంలో జాన్వీ కపూర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. శ్రీదేవి కుమార్తె కావడంతో ఈమెపై కొందరు పాజిటివ్‌గానే మాట్లాడుతున్నా.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం జాన్వీ కపూర్‌కు విమర్శలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఈమెపై ఉన్న నెగెటివిటీ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోకుండా.. తన మానాన తన పని తాను చేసుకుంటోంది. అందుకనే ఆమెపై వస్తున్న విమర్శలు కాస్త తగ్గాయని చెప్పవచ్చు. ఇక జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ లక్ జెర్రీ ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
ఇక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ కపూర్.. ఎన్‌టీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్‌టీఆర్ తో నటించడాన్ని తాను ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలియజేసింది. దీంతో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే వాస్తవానికి జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ మూవీలో నటించాల్సి ఉంది. కానీ ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో ఆ చాన్స్ కోల్పోయింది. అయితే ఎన్‌టీఆర్‌తో సినిమాలో నటించే చాన్స్ వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే ఈ అమ్మడు జాక్ పాట్ కొట్టినట్లే అవుతుంది. విజయ్ కన్నా ఎన్‌టీఆర్ పాపులర్. కనుక ఆయనతో సినిమా చేస్తే కచ్చితంగా జాన్వీకి అది బూస్టింగ్ అవుతుంది. కెరీర్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకోవచ్చు. మరి ఆమె అలా చేస్తుందా లేదా అనేది చూడాలి.
అయితే జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌పై ఆ కామెంట్స్ చేయడంతో త్వరలోనే ఆమె ఆయన మూవీలో నటిస్తుందని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి పుకార్లే వచ్చాయి. కానీ వాటిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మళ్లీ ఇవే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె ఎన్‌టీఆర్, కొరటాల మూవీలో లేదా.. తరువాత బుచ్చిబాబు, ఎన్‌టీఆర్ మూవీలో నటిస్తుందని అంటున్నారు. అయితే దీనిపై స్పష్టత రావల్సి ఉంది. మరి జాన్వీ ఇప్పటికైనా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…