Janhvi Kapoor : టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నారు. అయితే ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో తారక్ సరసన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. ఇదివరకు ఈ సినిమాలో తారక్ సరసన నటించడం కోసం అలియా, కియారా పేర్లు వినిపించినప్పటికీ తాజాగా జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది.ఇందులో దాదాపుగా జాన్వీ కపూర్ ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే గతంలో శ్రీదేవి చనిపోకముందు తారక్ తో శ్రీదేవి ఒకానొక సందర్భంలో తన కూతురిని టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ద్వారా పరిచయం చేయాలని కోరిందట. తారక్ తాత సీనియర్ ఎన్టీ రామారావు, శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అందుకోసమే ఎన్టీఆర్ సినిమా ద్వారా తన కూతురిని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎన్టీఆర్ తో చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శ్రీదేవి కోరిక నెరవేరబోతోందని అనిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే.. వేచి చూడక తప్పదు.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…